Begin typing your search above and press return to search.

గోవా బీచుల్లో కొత్త డేంజర్.. రెండు రోజుల్లో 90 మంది ఆసుపత్రి పాలు

By:  Tupaki Desk   |   21 Nov 2020 6:15 AM GMT
గోవా బీచుల్లో కొత్త డేంజర్.. రెండు రోజుల్లో 90 మంది ఆసుపత్రి పాలు
X
గోవా అన్నంతనే అందమైన బీచులు గుర్తుకు వస్తుంటాయి. దేశంలో బీచులున్న ప్రాంతాలకు కొదవ లేనప్పటికీ.. గోవా బీచుల అందం ముందు దిగదుడుపే. అలాంటి బీచులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. గోవాకు వెళ్లి.. సరదాగా బీచుల్లో ఎంజాయ్ చేయాలంటే మాత్రం రిస్కుతోకూడుకున్న పనిగా చెబుతున్నారు. దీనికి కారణంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మార్పులుగా చెప్పక తప్పదు.

గోవా బీచుల్లో సన్ బాత్ చేయటం.. సరదాగా తిరగటం లాంటివి చేస్తుంటారు. అయితే.. చాలా బీచుల్లో బ్లూ జెల్లీ ఫిష్ లు టూరిస్టులకు చుక్కలుచూపిస్తున్నాయట. గోవా సముద్ర తీర ప్రాంతంలో వీటి బెడద ఇప్పుడు ఎక్కువైనట్లు చెబుతున్నారు. గోవా సముద్ర తీర ప్రాంతంలో జెల్లీ ఫిష్ లు కొత్తవేం కానప్పటికీ.. బ్లూ కలర్ వాటితో చాలా డేంజర్ అని చెబుతున్నారు. ఇవి కుట్టినంతనే భరించలేనంత నొప్పితో పాటు.. కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కుడితే వెంటనే ట్రీట్ మెంట్ తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు.

సాధారణంగా జెల్లీ ఫిష్ లు రెండు రకాలు. ఒక రకం కుట్టవు. కానీ.. అందుకు భిన్నంగా బ్లూ కలర్ జెల్లీ ఫిష్ లు ఉంటాయి. ఇవి ఇట్టే కుట్టేస్తుంటాయి. వీటిని బారిన పలువురు పడుతున్నారు. గడిచిన రెండు..మూడు రోజుల్లో దాదాపుగా 90 మందిని ఇవి కుట్టటం.. దీంతో వారు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమని పలువురు హెచ్చరిస్తున్నారు.

కలంగ్యూట్ లో 55 మంది.. కాండోలిమ్ బీచ్ లో పది మంది.. సౌత్ గోవాలో 25 మంది ఈ జెల్లీ ఫిష్ బారిన పడినట్లుగా తేల్చారు. గోవాలోని ఒక బీచ్ లో ఒక వ్యక్తి జెల్లీ ఫిష్ కుట్టిన కారణంగా కిందకు పడిపోవటంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్చారు. దీంతో.. బ్లూ జెల్లీ ఫిష్ లు ఎంత ప్రమాదకరమన్న విషయాన్ని గుర్తించటంతో పాటు.. పర్యాటకుల్ని హెచ్చరిస్తున్నారు. సో.. ఇలాంటివేళ గోవాకు వెళ్లే వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.