జగన్ అంటే భయమా... టీడీపీ కేడర్లో కొత్త కన్‌ఫ్యూజన్ ?

Sun Aug 01 2021 10:04:03 GMT+0530 (IST)

New Confusion in the TDP

తెలుగుదేశం పార్టీకి వైసీపీ విషయంలో క్లారిటీ ఉందా అన్నది ఎవరికీ అర్ధం కాని విషయం. వైసీపీ అంటేనే పొడగిట్టని తీరుతో  పదేళ్ళుగా టీడీపీ ఉంది. జగన్ తో రాజకీయ వైరం కంటే కూడా వ్యక్తిగత వైరమే టీడీపీకి ఎక్కువగా ఉంది. జగన్ ఈ జన్మలో సీఎం కాడు అని ఎకసెక్కంగా మాట్లాడింది కూడా టీడీపీ నేతలే.  ఇక 2014 ఎన్నికల్లో జగన్ని దెబ్బతీయడానికే పవన్ని సైతం రాజకీయ అరంగేట్రం చేయించారని అంటారు. ఎన్ని చేసినా కూడా జనాల్లో తరగని ఆదరణ ఉన్న జగన్ 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడాన్ని టీడీపీ నేతలు అసలు తట్టుకోలేకపోతున్నారు. అయితే గత రెండేళ్ళుగా టీడీపీ విపక్ష పాత్రను సక్రమంగా నిర్వహిస్తోందా అన్నదే పెద్ద  చర్చగా ఉంది.టీడీపీ ఏ విషయాన్ని అయినా ప్రభుత్వాన్ని పట్టుకుని విమర్శించడమే పనిగా పెట్టుకుందని కూడా సెటైర్లు పడుతూంటాయి. ఒక్క విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకోలేదని వైసీపీ నేతలు కూడా అంటూంటారు. నిజానికి ప్రతిపక్షం అంటే గుడ్డిగా వ్యతిరేకించడం కానే కాదు గతంలో విపక్షాలు అలా చేసేవి కావు. ఏపీలో జగన్ రెండేళ్ళలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అదే సమయంలో జగన్  సర్కార్ మంచి పనులు కూడా కొన్ని చేసి ఉంటారు కదా అన్నది కూడా ఆలోచించాలి. అలా మంచి పనులు చేసినపుడు మెచ్చుకుని చెడ్డ పనులు చేసినపుడు నిందిస్తే కచ్చితంగా తెలుగుదేశం మాటకు జనంలో విలువ పెరిగేది అని కూడా అంటారు.

ఇక జగన్ని పట్టుకుని ఫేక్ ముఖ్యమంత్రి అయి అసమర్ధుడు అని అవినీతిపరుడు అంటూ విమర్శలు చేయడం వల్ల జనాల్లో టీడీపీ గ్రాఫ్ అసలు పెరగడంలేదు అంటున్నారు. జగన్ విషయంలో టీడీపీ ఒంటి కాలితో లేస్తుంది. దానికి కారణం మళ్లీ మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని భయమా. లేక జగన్ కి జనాదరణ  ఉందని అక్కసా.  ఫార్టీ యియర్స్ హిస్టరీ ముందు జగన్ ఏమీ కాడని తేలికభావమా ఈ సంగతి ముందు క్యాడర్ కి అర్ధం కావాలి. లేకపోతే ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా జగన్ ని ఢీ కొట్టడం కష్టమే అంటున్నారు.