కెరీర్ లో ఎన్నడూ లేదిలా..నెటిజన్ల ట్రోలింగ్ లో తొలిసారి క్రికెట్ దిగ్గజం

Sun Oct 25 2020 19:30:06 GMT+0530 (IST)

Netizens Trolling This Team For The First Time

ఎంఎస్ ధోనీ టీమిండియాలోకి  ఎంట్రీ ఇవ్వగానే బ్యాట్స్ మెన్ గా కీపర్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. కొద్ది కాలానికే కెప్టెన్సీ వచ్చింది. రెండు వరల్డ్ కప్ లు తెచ్చాడు. అప్పుడంతా ప్రశంసలే. ఈ సారి వరల్డ్ కప్ లో సెమిస్ చేరకుండానే టీమిండియా ఇంటి బాట పడ్డా కూడా ధోనీ వైఫల్యం చెందినా ఫ్యాన్స్ విమర్శించలేదు. తొలిసారి ఐపీఎల్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ఓటములతో చివరికి ధోనీ కూడా ట్రోల్స్ కు గురయ్యాడు.  శుక్రవారం రాత్రి షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై  ఘోరంగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి చేరుకున్నది. కోట్లాది  మంది అభిమానుల ఆశలను ధోనీ సేన నీరు గార్చింది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది సార్లు ఓడిపోయింది. మూడు సార్లు ఛాంపియన్ ఐదుసార్లు రన్నరఫ్‌తో పాటు అన్ని సీజన్స్‌లో ఫ్లే ఆఫ్స్‌కి చేరిన ఘనత కలిగిన చెన్నై ఈసారి టోర్నీలో కనీస పోరాట పటిమను సైతం చూపలేక ఆటగాళ్లు ప్రత్యర్థికి దాసోహమన్నారు. దీంతో ‘ధోనీ  ఇక తప్పుకో..! యువకులకు అవకాశం ఇవ్వు’ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ సారి కెప్టెన్ ధోనీతో పాటు రవీంద్ర జడేనా అంబటి రాయుడు షేన్ వాట్సన్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు.అనుహ్యంగా సురేష్ రైనా హర్బజన్‌సింగ్ టోర్నీ నుంచి వైదొలగడంతో జట్టు కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్‌లోనే ముంబైపై విజయం సాధించి ఖాతా తెరిచిన ధోనీ సేన ఆ తర్వాత దారుణమైన ఓటములను చవిచూసింది. కెప్టెన్ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేదని విమర్శలు వస్తున్నాయి.  

వచ్చే సీజన్‌లోనైనా జట్టు పటిష్ఠంగా ఉండాలంటే జట్టు ప్రక్షాళన చేయాల్సిందేనని ఫ్యాన్స్ కోరుతున్నారు. రైనాను తిరిగి తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. జట్టులో చాలామంది 33 ఏళ్లకు పైబడిన వారు కావడంతో ఇతర జట్లతో సమానంగా వేగాన్ని అందుకోలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ వల్ల తొలిసారి ధోనీ ట్రోల్స్ కు గురయ్యాడు. ఇది ధోనీ ఫ్యాన్స్ ని మాత్రం బాధిస్తోంది.