35 వేల కోట్లు కాకులు ఎత్తుకుపోయాయా మోడీ జీ: ఇదే చర్చ

Wed May 12 2021 13:00:24 GMT+0530 (IST)

Netizens Fires On Pm Modi

దేశంలో కరోనా విలయం జోరుగా ఉంది. ఈ సమయంలో ప్రజలు ప్రభుత్వాల నుంచి కొంతైనా స్వాంతన కోరుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అంటూ.. అందరికీ ఫలాలు పంచుతామని పేర్కొన్న మోడీ..  ఈ ఆపద సమ యంలో తమను ఆదుకుంటారని.. అనుకున్నారు. అయితే.. దీనికి విరుద్ధంగా మోడీ వ్యవహరిస్తున్నారనే కామెంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.ప్రధానంగా ఏటా ప్రకటించే వార్షిక బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమానికి కేటాయిస్తున్నారు. మరి ఆ నిదులు ఏమవుతున్నాయనేది సామాన్యుల ప్రశ్న. ఇక ఈ ఏడాది కూడా వార్షిక బడ్జెట్‌లో దాదాపు 35 వేల కోట్ల రూపాయలను ప్రజల `ఆరోగ్య రక్ష` పథకం కోసం కేటాయించారు. అయితే.. ఇప్పటి వరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలకు ఖర్చు చేయలేదని అంటున్నారు పరిశీలకులు. వ్యాక్సిన్ కోసం కేటాయించింది కేవలం 3000 వేల కోట్లు 1500 కోట్లు మాత్రమే!

దీంతో దేశవ్యాప్తంగా మోడీపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రులు సైతం కొందరు.. మోడీని దుయ్య బడుతున్నారు. తన మనసులో మాట కాదు.. ప్రజల మనసులో మాట ముఖ్యమంత్రుల మనసులో మాట వినాలని వారు కోరుతున్నారు. అయితే.. ఇక్కడే మరికొందరు మాత్రం ప్రస్తుతం దేశం ఉన్న పరిస్తితిలో అందరం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇలా ఈ వర్గం ఆలోచిస్తుంటే.. ప్రతిపక్షాల విమర్శలను మోడీ ఎక్కడా పట్టించుకోవడం లేదు.

వ్యాక్సిన్ విషయంలో కానీ కరోనా వైద్య సేవలపై కానీ.. ప్రతిపక్షాల ను ఇన్వాల్వ్ చేస్తే.. మోడీ ఇమేజ్.. అంటే ఇప్పటి వరకు తెచ్చుకున్న పేరు కూడా డ్యామేజీ అయ్యే అవకాశం ఉందని మోడీ సహా బీజేపీ నేతలు భావిస్తున్నారని.. అందుకే మోడీ ఎవరినీ పట్టించుకోవడం లేదని కొందరు అంటున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది సరైన విధానం కాదని.. అఖిల పక్షంతో భేటీ అయి.. వారు ఇచ్చే సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని.. చర్యలు చేపట్టాలని తద్వారా దేశంలో మెరుగైన సేవలు అందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం.. ఈ సూచనలను పెడచెవిన పెడుతోందని సెకండ్ వేవ్ వస్తుందని.. అన్ని వర్గాల నుంచి కథనాలు వచ్చినా.. మోడీ సర్కారు పట్టించుకోలేదు. పైగా.. తొలి వేవ్‌ను సాధించామనే ధీమాతో.. మోడీకి కితాబు కూడా ఇచ్చుకుని వాళ్లకు వాళ్లే జబ్బలు చరుచుకున్నారు. అంతేకానీ వ్యాక్సిన్ విషయంలో సమర్ధంగా వ్యవహరించలేక పోయారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఇదే చర్చ సాగుతోంది.

కనీసం బడ్జెట్లో పెట్టిన 35 వేల కోట్లు కూడా వ్యాక్సిన్ కోసం ఇవ్వకుండా.. దేశంలో ప్రజలు చనిపోతున్నా.. బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేక పోతోందని అంటున్నారు పరిశీలకులు. మోడీ వ్యక్తిగత ఖర్చులు ఖరీదైన డ్రస్‌లకు ఇస్తున్న ప్రాధాన్యం.. వ్యాక్సిన్‌కు ఇవ్వడం లేదని.. మరి బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ము కాకి ఎత్తుకు పోయిందా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.. పరిశీలకులు. మరి దీనికి బీజేపీ నేతలు ఏం చెబుతారోచూడాలి.