Begin typing your search above and press return to search.

అనిత 1977 'బాబు' కథ, అక్కా.. కొత్తగా ట్రై చేయాలని నెటిజన్ సూచన

By:  Tupaki Desk   |   12 Aug 2020 5:30 AM GMT
అనిత 1977 బాబు కథ, అక్కా.. కొత్తగా ట్రై చేయాలని నెటిజన్ సూచన
X
వైసీపీ పేరు చెబితే టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత అంతెత్తున లేస్తారు. తాజాగా, 1977లో బాబు అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందించారు. 1977లో ఓ రోజు 5 ఏళ్ల వయస్సున్న బాబు బయట ఆడుకుంటున్నారని, ఇంతలో రోడ్డు మీద అంబులెన్స్ శబ్ధం విని, తన చేతిలోని బొమ్మలు పడేసి, ఇంట్లోకి పరుగెత్తి దాక్కున్నాడని, ఏమయిందని తల్లి అడిగితే పోలీస్ సైరన్‌గా భావించినట్లు చెప్పాడని, బాబుది ఆ వయస్సు నుండే అంత అమాయకత్వమని అనిత ట్వీట్ చేశారు.

ఆమె సందర్భం వచ్చినప్పడుల్లా ట్విట్టర్‌లో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండియా టుడేలో వచ్చిన ర్యాంక్ మన కష్టం, మన సామర్థ్యం వల్ల వచ్చిందని జబ్బలు చరుచుకున్న వాళ్లు, అదే ఇండియా టుడేలో కోవిడ్ మేనేజ్‌మెంట్‌లో ఏపీ వరస్ట్ అనగానే పచ్చ మీడియా అనడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.

అనిత ట్వీట్లపై వైసీపీ అభిమాన నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆమెను పరోక్షంగా రాజకీయ సమాధి చేస్తున్నారని, ఈ విషయం ఆమెకు అర్థమవుతుందో లేదోనని, పదేళ్ల తర్వాత మూడేళ్ల పాప అదే అంబులెన్స్‌కి ఎదురువెళ్లి మైండ్ దొబ్బెట్టుకుందని, అప్పటినుంచి ఏ లెక్క చెప్పినా ఒక 32 కలిపి చెబుతోందని, అంబులెన్స్ ఘటన జరిగింది.. 1955లో అని కౌంటర్ ఇచ్చారు. అక్కా మీరేం చెప్పినా చంద్రబాబు గురించి అని ఈజీగా తెలిసిపోతుంది.. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేయ్ అని మరొక నెటిజన్ సూచించారు.

అయితే అనితకు అనుకూలంగా కూడా ట్వీట్లు వచ్చాయి. మన రాష్ట్రంలో కరోనా పరిస్థితి చూసి దేశమంతా చెందుతుంటే, సీఎంకు మాత్రం ఇవి పట్టడం లేదని, తన వరస్ట్ పనితనం బయట పెట్టిన, ఇండియా టుడే ఛానల్‌ని రేపటి నుండి బ్యాన్ చేస్తారేమోనని, కరోనా విషయంలో మా రాష్ట్రం వరస్ట్ అని ఇండియా టుడేలో రాస్తే, అయతే ఇండియా టుడేలో అది రాసినోడు, ఎడిటర్, ఓనర్ అందరూ కమ్మవాళ్లే అవుతారని, అంతే కదా బ్లూ బచ్చాస్ అంటూ నెటిజన్లు వైసీపీపై విమర్శలు గుప్పించారు.