Begin typing your search above and press return to search.

బండి సంజయ్ పగటి కలలు కంటున్నారా?

By:  Tupaki Desk   |   6 March 2021 3:28 AM GMT
బండి సంజయ్ పగటి కలలు కంటున్నారా?
X
తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. అందులో ఒక సంవత్సరం కరోనా కల్లోలంలోనే పోయింది. చేయడానికి ఏమీ లేకుండా చేసింది. ఇంకో ఏడాది మంత్రివర్గ విస్తరణ చేయకుండా కేసీఆర్ నాన్చి వేస్ట్ చేశాడన్న ఆవేదన నేతల్లో ఉంది.. చేస్తే గీస్తే ఈ మూడేళ్లలోనే ఏమైనా చేయాలి.. గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు సంపాదించుకునేది కూడా ఇప్పుడేనన్న గుసగుసలు ఉన్నాయి.

అయితే ఆదాయం వచ్చే అధికార పార్టీలోకే ఎవరైనా వస్తారు. ఆదాయం ఉండని.. ప్రభుత్వానికి టార్గెట్ అయ్యే ప్రతిపక్షంలో ఎవరూ ఉండాలని కోరుకోరు. రాజకీయాల్లో అదొక సహజ ప్రక్రియ.. ప్రతిపక్షంలో గెలిచినా అధికార పార్టీలోకి క్యూ కట్టేది అందుకే.

అయితే మన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం పగటి కలలు కంటున్నాడని ప్రజల్లో, సోషల్ మీడియాలో కొందరు ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ను కొట్టే మగాడే లేడు. ఎందుకంటే ఆయన పార్టీకి అసెంబ్లీలో ఫుల్ మెజార్టీ ఉంది. ప్రజలే ఇచ్చారు. ఆదాయం, అధికారం ఉండే అధికార పార్టీని వీడి ఎవరూ పోరు.. కానీ మన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మాత్రం హాట్ కామెంట్స్ చేశారు.‘‘ సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగని కేసీఆర్ కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ వీడుతారో తెలియదన్నాడు.’’

ఇంత బలంగా ప్రభుత్వం కళ్లముందు ఉన్నా.. అధికార పార్టీ నుంచి ఎవరూ బయటకు రారు అని తెలిసినా బండి మాటలు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాస్యాస్పదంగా మారాయని ప్రజల్లో చర్చ సాగుతోంది. అధికార పార్టీ నుంచి అధికారం పోగొట్టుకొని ఎవరు రారు అని బండి సంజయ్ కి కనీసం తెలియదా అని పలువురు హితవు పలుకుతున్నారు. వస్తే సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు టీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వస్తారు.. కానీ మూడేళ్ల అధికారం పోగొట్టుకొని ఎవరైనా వస్తారా బండి సంజయ్ గారూ అని ప్రజలు అంటున్నారు.. ఏదైనా తర్కానికి నిలబడేలా బండి సంజయ్ మాట్లాడాలని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల విశ్వసనీయత కోల్పోతారని సూచిస్తున్నారు.