Begin typing your search above and press return to search.

ఏమిటిది మోడీ సార్‌.. ప్ర‌జాధ‌నంపై ఇన్ని కామెంట్లా?

By:  Tupaki Desk   |   19 Jun 2021 10:30 AM GMT
ఏమిటిది మోడీ సార్‌.. ప్ర‌జాధ‌నంపై ఇన్ని కామెంట్లా?
X
ఏ ప్ర‌భుత్వానికైనా ఆర్థిక ఊతం ఎక్క‌డ నుంచి వ‌స్తుంది? ఖ‌జానా ఎలా నిండుతుంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ప్ర‌త్యేకంగా ఎవ‌రూ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల నుంచి.. ప్ర‌భుత్వాలు వ‌డ్డించే సెస్సుల నుంచే అన్న విష‌యం తెలిసిందే. కానీ, ఘ‌న‌త వ‌హించిన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్రం.. కేంద్ర ప్ర‌భుత్వ ఖ‌జానా సొమ్మును త‌న సొంత ఖాతాలో సొమ్ముగా భావిస్తున్నార‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. దీనిపై నెటిజ‌న్లు.. మేధావులు, బ‌డా పారిశ్రామిక వేత్త‌లు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. కోవిడ్‌-19 ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు మూడు నెల‌ల పాటు.. అధునాత‌న వైద్య సేవ‌లు అందించ‌డంపై ఇచ్చే శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. దేశంలోని 26 రాష్ట్రాల్లో 111 కేంద్రాల్లో ఈ శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. స‌రే.. ఇది ప‌క్క‌న పెడితే.. ఈ సంద‌ర్భంగా మోడీ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ నెల 21 నుంచి దేశ‌వ్యాప్తంగా టీకా ఉద్య‌మం ప్రారంభిస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ టీకా ఇస్తామ‌ని.. ఇది త‌మ బాధ్య‌త అని చెప్పారు. అంతేకాదు.. దీనికిగాను ఎంత ఖ‌ర్చ‌యినా.. వెనుకాడ‌కుండా పెడ‌తామ‌ని.. ఎన్ని కోట్ల‌యినా వెచ్చిస్తామ‌ని.. ఆవేశంగా ప్ర‌క‌టించారు.

ఈ రెండు కామెంట్ల‌పైనే ఇప్పుడు నెటిజ‌న్లు దుమ్ము దులుపుతున్నారు. అంద‌రికీ క‌రోనా టీకా ఇచ్చే విష‌యంలో నాలుగు నెల‌లుగా ఎందుకు తాత్సారం చేశార‌నేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. పైగా అంద‌రికీ టీకా ఇచ్చే బాధ్య‌త‌ను సుప్రీం కోర్టు గుర్తు చేస్తేనే కానీ.. మోడీకి గుర్తు రాలేదా? అనేది మ‌రో కామెంట్‌. ఇక‌, మ‌రో కీల‌క‌మైన అంశం.. ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నుల‌తోనే నిండుతున్న కేంద్ర ఖ‌జానా నుంచి టీకాకు నిధులు ఇస్తున్నారు. కానీ, మోడీ వ్యాఖ్య‌ల్లో మాత్రం.. ఏదో త‌న సొంత జేబులో నుంచి డ‌బ్బులు ఇస్తున్న‌ట్టు ఫీల‌వుతున్న‌ట్టుగా ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే క‌రోనా సెకండ్ వేవ్‌తో జ‌ర‌గాల్సిన ప్రాణ న‌ష్టం జ‌రిగిపోయింది. అనేక మంది కుటుంబాల‌కు కుటుంబాల‌నే కోల్పోయారు. మ‌రోప‌క్క‌, ప్ర‌జ‌లు ఇన్ని క‌ష్టాల్లో ఉంటే.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెంచి ఖ‌జానాను నింపుకొంటున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఏదో దేశ ప్ర‌జ‌ల కోసం..త‌న సంపాద‌నను త్యాగం చేస్తున్న‌ట్టు వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని అంటున్నారు నెటిజ‌న్లు. మ‌రి ఇదే క‌దా.. ఒకట‌ని రెండు అనిపించుకోవ‌డం అంటే.. అని పెద‌వి విరిస్తున్నారు మేధావులు.