Begin typing your search above and press return to search.

యువతి మెదడులో సూదులు.. సీటీస్కాన్​లో బయటపడ్డ దారుణనిజం

By:  Tupaki Desk   |   19 Oct 2020 11:30 PM GMT
యువతి మెదడులో సూదులు.. సీటీస్కాన్​లో బయటపడ్డ దారుణనిజం
X
సీటీస్కాన్​ లో బయట పడ్డ ఓ దారుణ నిజంతో వైద్యులు షాక్​ కు గురయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ ఓ యువతికి సీటీ స్కాన్​ చేయడంతో ఆమె మెదడులో సూదులు కనిపించాయి. ఈ సూదులు ఎలా వచ్చాయో తెలియక.. ఆమె సంబంధికులు, డాక్టర్లు షాక్​ కు గురయ్యారు. యువతి పసితనంలోనే సూదులు ఉద్దేశ పూర్వకంగా చొప్పించారని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పెద్దయ్యాక గట్టిపడిన పుర్రెలో అటువంటి మందపాటి సూదులను చొప్పించడం అసాధ్యమని వైద్యులు అంచనా వేస్తున్నారు. చాలామందికి ప్రమాదాలు జరిగినప్పుడు చిన్నచిన్న లోహపు ముక్కలు శరీరంలో చొచ్చుకుపోతాయి. వాటిని తొలగించినప్పటికీ, కొన్ని మాత్రం ఎముక్కల్లోనూ, వెన్ను పూసలోనూ ఇరుక్కున్నప్పుడు మాత్రం డాక్టర్లు అలాగే వదిలేస్తుంటారు. ఇటీవల సదరు యువతి కారు ప్రమాదంలో గాయపడింది. ఆ తర్వాత సీటీ స్కాన్ చేయించుకోగా, మెదడులో రెండు పొడవైన లోహపు సూదులు బయటపడ్డాయి.

జెంగ్‌జౌకు చెందిన 29 ఏళ్ల మహిళకు చిన్న కారు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత డాక్టర్‌ సిటి స్కాన్‌ చేయమని కోరాడు. సిటి స్కాన్ నివేదికను చూసి వైద్యులు ఆశ్యర్య పోయారు. తలపై ఎటువంటి గాయాలు లేకుండా 5 సెం.మీ పొడవు, 4.9 మిమీ వ్యాసం కలిగి ఉన్న రెండు సూదులు ఆమె మెదడులో లోతుగా కనిపించడంతో వైద్యులు ఆశ్చర్య పోయారు. కారు ప్రమాదానికి సూదులకు సంబంధం లేదు.. యువతి పసితనంలోనే ఎవరో ఉద్దేశపూర్వకంగా చొప్పించారని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పెద్దయ్యాక గట్టిపడిన పుర్రెలో అటువంటి మందపాటి సూదులను చొప్పించడం అసాధ్యమని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఆమె మెదడు పరిస్థితి గురించి మహిళను అడిగినప్పుడు, ఆమె తనకు ఎప్పుడూ ఎలాంటి నొప్పిఅనుభవించలేదని తెలిపింది. అయితే ఇలాంటి కేసును తాము ముందెప్పుడూ చూడలేదని డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.