ఆధార్ ఉంటేనే హెయిర్ కట్ అంట !

Tue Jun 02 2020 20:00:01 GMT+0530 (IST)

Need Haircut Show Your Aadhar Card

ఒక్క వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచ రూపురేఖల్ని మార్చేసింది. ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనితో పదే పదే చేతులు శుభ్రం చేసుకోవడం ...భౌతిక దూరం పాటించడం వంటివి చాల ముఖ్యం అని చెప్తున్నారు.  ఇలాంటి ఎన్నో  కొత్త నియమ నిబంధనల శ్రీకారం చుట్టింది ఈ వైరస్. హెయిర్ కటింగ్ సెంటర్లలో జుట్టు కత్తిరించుకోవాలన్నా ఈ రూల్స్ పాటించాల్సిందే.కటింగ్ అంటే... ఇన్నాళ్లూ ఒక ఎత్తు... ఇప్పుడు మరో ఎత్తు. తాజాగా తమిళనాడులో సెలూన్లకు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం సెలూన్‌ని వెళ్లిన వారంతా తమ పేరు అడ్రెస్ మొబైల్ నంబర్లు ఆధార్ కార్డ్ ఐడీ నంబర్ చెప్పాల్సి ఉంటుంది. సెలూన్‌కి వెళ్లాలంటే డబ్బులుంటే చాలవా ఇవన్నీ ఎందుకూ అని అనిపిస్తే తప్పులేదు. సమస్యేంటంటే సెలూన్ లో పనిచేస్తున్న ఎవరికైనా కరోనా సోకితే ఆ వ్యక్తి నుంచి కస్టమర్లకు ఎవరికైనా సోకిందా అన్నది తెలుసుకోవడం కోసం కస్టమర్ల వివరాలన్నీ తీసుకుంటున్నారు.

గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు కమిషనర్లకు సూచనలతో కూడిన ఆదేశాలను ప్రభుత్వం విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు బ్యూటీపార్లర్ల ప్రవేశద్వారాల్లో హ్యాండ్ శానిటైజరు సబ్బు నీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. జుట్టు కత్తిరించుకునేవారు ముందుగానే అప్పాయింట్‌మెంట్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ హెయిర్ కటింగులు చేయించుకోవాలని తెలిపింది. వాడిన బ్లేడ్లను తిరిగి ఉపయోగించరాదని హెడ్ బాండ్స్ టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని ఆర్డర్ జారీ చేసింది. ఇది ప్రస్తుతానికి తమిళనాడుకే పరిమితమైనా... ముంబైలో ఎవరి టవల్ వారే తెచ్చుతోవాలనే ఓ కండీషన్ పెట్టారు. అన్ని రాష్ట్రాలూ దాదాపు ఇలాంటి రూల్స్ పెడుతున్నాయి.