Begin typing your search above and press return to search.

పీఎఫ్ ఐపై ఎన్ ఐఏ సంచ‌ల‌న నివేదిక‌.. అనేక విష‌యాలు..

By:  Tupaki Desk   |   24 Sep 2022 11:16 AM GMT
పీఎఫ్ ఐపై ఎన్ ఐఏ సంచ‌ల‌న నివేదిక‌.. అనేక విష‌యాలు..
X
భార‌త్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? దీనిలో భాగంగా యువ‌త‌ను కీల‌కంగా వినియోగించుకుంటున్నారా? అంటే.. ఔన‌నే అంటోంది ఎన్ ఐఏ తాజాగా.. కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌. ఇటీవ‌ల దేశవ్యాప్తంగా జరిగిన పీఎఫ్ఐకి చెందిన స్థలాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది.

ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు రిమాండ్ రిపోర్టును రూపొందించింది.

యువతను లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. ఇందులో భాగంగా ఈ సంస్థ.. భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి కుట్ర పన్నిం దని నివేదికలో వెల్లడించింది.

భార‌త్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చ‌డ‌మే వీరి వ్యూహ‌మ‌ని ఎన్ ఐఏ వెల్ల‌డించింది. మరోవైపు, ఈ సంస్థపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా బార్ అసోసి యేషన్.. కేంద్రాన్ని కోరింది. పీఎఫ్ఐకి సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది.

సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది.

కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు (10), అసోం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి, దిల్లీ (3) రాజస్థాన్ (2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.