Begin typing your search above and press return to search.

నేషనల్ హైవే అథార్టీ వరల్డ్ రికార్డ్ ... 18 గంటల్లో 25 కి.మీ రోడ్డు నిర్మాణం !

By:  Tupaki Desk   |   1 March 2021 7:30 AM GMT
నేషనల్ హైవే అథార్టీ వరల్డ్ రికార్డ్ ... 18 గంటల్లో 25 కి.మీ రోడ్డు నిర్మాణం !
X
సాధరణంగా ఓ రోడ్డు నిర్మాణం జరగాలి అంటే ఎన్నో సమస్యలు దాటుకుంటూ ముందుకుపోవాల్సి ఉంటుంది. ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మించాలంటే అదో పెద్ద కథ ఇక జాతీయ రహదారి అయితేనా ఇక అదో ప్రస్థానమే సర్వే చేసిన తర్వాత నుంచి రోడ్డు పూర్తయ్యే వరకు పెద్ద ప్రక్రియ, పని ప్రారంభం అయిన తర్వాత.. పైన పూత పూసేందుకే, కిలోమీటర్‌ కు కనీసం 3 రోజులు సమయం పడుతుంది. అలాంటింది నేషనల్ హైవే అధికారులు రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్‌ మధ్య కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను అధికారులు రికార్డు సమయంలో పూర్తి చేశారు.

లాపూర్‌, బీజాపూర్‌ జాతీయ రహదారిలో 25 కిలోమీటర్ల పనులను కేవలం 18 గంటల్లోనే అధికారుల పూర్తి చేశారు. ఇందుకోసం ముందస్తుగా భారీ ప్రణాళిక వేసుకున్నారు. సుమారు 500 మంది కార్మికులు, 40 మంది ఇంజినీర్లు పని చేశారు. ఏకకాలంలో సుమారు 30 యంత్రాలతో పాటు 60 టిప్పర్లతో రహదారిపై కాంక్రీట్, తారు మిక్సింగ్ పూత పూశారు. క్వాలిటీ చెకింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా కేవలం 18 గంటల్లోనే 25 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులను అధికారులు పూర్తి చేసి ప్రయాణాలకు అనుమతి ఇచ్చారు.

ఈ విషయాన్ని కేంద్రరోడ్డు రవాణా, నేషనల్ హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ‌లో తెలిపారు. ఇంత వేగంగా జరిగిన ఈ పని లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లోకి ఎక్కింది. కార్మికులకు, NHAI ప్రాజెక్టు డైరెక్టర్‌ కూ, నిర్మాణ కంపెనీ ప్రతినిధులకూ నా శుభాభినందనలు అని గడ్కరీ ట్వీట్ చేసారు. నిజానికి ఇది చాలా పెద్ద రోడ్డు. ఇది బెంగళూరు-చిత్రదుర్గ-విజయపూర్-సోలాపూర్-ఔరంగాబాద్-ధూలే-ఇండోర్-గ్వాలియర్ మధ్య ఉంది. హై డెన్సిటీ ట్రాఫిక్ కారిడార్‌గా దీన్ని చెబుతున్నారు. అంటే వాహనాల రద్దీ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు దాదాపు 500 మంది కాంట్రాక్టర్ కంపెనీ ఉద్యోగులు హార్డ్ వర్క్ చేశారు.