Begin typing your search above and press return to search.

చైనా అంశంపై ప్రధాని మోడీ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   17 Jun 2020 10:50 AM GMT
చైనా అంశంపై ప్రధాని మోడీ కీలక నిర్ణయం
X
పక్కలో బల్లెంలా మారి సరిహద్దుల్లో ఘర్ణణకు దిగుతూ భారత సైనికుల ప్రాణాలు తీసిన చైనాతో తాడోపేడో తేల్చుకోవడానికి ప్రధాని మోడీ రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఈనెల 19న అఖిలపక్ష భేటి నిర్వహించడానికి ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 19న సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై అభిప్రాయాలు తీసుకోనున్నారు.

ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షుడు పాల్గొని తమ అభిప్రాయలు తెలియజేయాల్సిందిగా ప్రధాని మోడీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో కోరింది.

చైనాతో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు పెద్ద ఎత్తున మరణించడం దేశవాసుల్లో ఆగ్రహానికి ఆవేదనకు కారణమైంది. ఈ అంశంపై విపక్షాలు మండిపడుతున్నాయి. లఢక్ లోయలో ఏం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు.

చైనా విషయంలో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి మోడీ రెడీ అయ్యారు. భారత సైనికుల మృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ దీనిపై సీరియస్ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.