Begin typing your search above and press return to search.

హీరోలకు దక్కిన ఘనత మ్యూజిక్ డైరెక్టర్ కి దక్కనివ్వరా..?

By:  Tupaki Desk   |   4 April 2020 2:30 PM GMT
హీరోలకు దక్కిన ఘనత మ్యూజిక్ డైరెక్టర్ కి దక్కనివ్వరా..?
X
కరోనా మహమ్మారి మన దేశంలో కూడా విజృభించడం ప్రారంభించింది. ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ ఇక్కడి దాకా ఏమి వస్తుందిలే అనుకున్నారు. కానీ అది ఇప్పుడు మన పక్కకొచ్చి చేరింది. దేశాన్ని కరోనా మేఘాలు దట్టంగా కమ్మేస్తున్న పరిస్థితులలో రోజు రోజుకి కొత్త కేసులు బయటపడటంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య మూడు వేలను దాటిపోయింది. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కరోనా కేసులలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీల మీద కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా నమోదు కావడంతో సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితులలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సమస్యను అడ్డుకోవడంలో రకరకాల కారణాలతో విఫలం అవుతున్న పరిస్థితులతో అందరు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పై సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాటకు అనూహ్య స్పందన వస్తోంది. కోటి స్వరపరిచిన ఈ గీతంలో చిరంజీవి - నాగార్జున - సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ లు నటించడంతో ఈ పాటకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది.

అయితే ఇప్పుడు ఈ పాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి వరకు వెళ్ళడమే కాకుండా ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు కూడా. 'చిరంజీవిగారికీ - నాగార్జునగారికీ - వరుణ్ తేజ్ కీ - సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం' అంటూ ప్రధాని మోడీ ట్విట్ చేసారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని ఘనత చిరంజీవి - నాగార్జున - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ లకు దక్కింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ ఆ సాంగ్ లో యాక్ట్ చేసిన హీరోలకు దక్కిన గౌరవం ఆ సాంగ్ స్వరపరిచి పాడిన కోటీకి మాత్రం దక్కలేదని చెప్పవచ్చు. సంగీత దర్శకుడు కోటీని మోడీ మెన్షన్ చేయలేదు. పెద్దాయన ప్రధాని అంటే మర్చిపోయారు సరే ఇక్కడి వాళ్ళకి ఏమైంది. అప్పటికీ మెగాస్టార్ చిరంజీవి.. మోడీ గారి ట్వీట్ కి రిప్లై ఇస్తూ మ్యూజిక్ డైరెక్టర్ కోటీని కూడా అభినందించారు. అయినా ఇప్పటికీ ఆయన్ని ఎవరూ గుర్తించడం లేదు. అంతేలే హీరోలకు ఉన్న గుర్తింపు తెర వెనక కష్టపడేవారికి ఉండదు కదా.. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైందని చెప్పవచ్చు. ఏదేమైనా ఆ సాంగ్ కంపోజ్ చేసి పాడిన మ్యూజిక్ డైరెక్టర్ కోటీకి మేజర్ క్రెడిట్ దక్కాలి అనడంలో సందేహం లేదు.