Begin typing your search above and press return to search.

బాబును కరివేపాకులా తీసేసిన మోడీ

By:  Tupaki Desk   |   6 April 2020 2:48 PM GMT
బాబును కరివేపాకులా తీసేసిన మోడీ
X
2014 ఎన్నికలకు ముందు ఎన్డీఏకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల ప్రచారంలో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కలిసి ఏపీలో ముమ్మర ప్రచారం చేశారు చంద్రబాబు. దేశంలోని సీనియర్ పొలిటిషిన్లలో ఒకరు కావడం...కొద్దోగొప్పో సీఎంగా పనిచేసిన అనుభవం ఉండడంతో బాబుకు మోడీ ఒకింత ఎక్కువే గౌరవం ఇచ్చారు. ఇక, 2014లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 2019 సాధారణ ఎన్నికల ముందు వరకు ప్రధానితో స్నేహం కొనసాగించిన బాబు..ఒక్కసారిగా ప్లేటు మార్చారు. ప్రధానికి వెన్నుపోటు పొడిచే దిశగా అడుగులు వేస్తూ...ఫెడరల్ ఫ్రంట్ అంటూ విపక్ష నేతలతో కలిసి మోడీపై విమర్శలు గుప్పించారు. మోడీని గద్దె దించేందుకు తాను కంకణం కట్టుకున్నానంటూ....వీర లెవల్ లో వీరావేశంతో స్పీచ్ లిచ్చారు. ఇక, అన్నీ కుదిరితే ప్రధాని పీఠంపై కూడా ఓసారి కూర్చుందామని బాబు అత్యాశ పడ్డారు.

ఇక, ఏపీలో మోడీ ప్రచారానికి వస్తే గోబ్యాక్ మోడీ అంటూ బ్యానర్లు - పేపర్ యాడ్లతో హోరెత్తించారు. మిగతా నేతలు విమర్శలు చేసినా పట్టించుకోని మోడీ.... తనవాడనుకొని నమ్మిన బాబు....తనపై విమర్శలు గుప్పించడంతో చాలా ఫీలయ్యారు. ఇంకా చెప్పాలంటే....బాబు వ్యాఖ్యలను పర్సనల్ గా తీసుకున్న మోడీ....బాబును ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టారు. తాజాగా, ఓ విషయంలో చంద్రబాబును మోడ పరిగనలోకి తీసుకోకపోవడంతో...బాబుపై మోడీ కోపం ఇంకా తగ్గలేదని స్పష్టమవుతోంది. కరోనా కట్టడిపై దేశంలోని విపక్ష నేతలు - సీనియర్ రాజకీయ నాయకులకు స్వయంగా ఫోన్ చేసి సలహాలు సూచనలు అడిగిన మోడీ...40 ఈయర్స్ ఇండస్ట్రీ బాబుకు ఫోన్ చేయకపోవడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. సోనియా గాంధీ - మన్మోహన్ సింగ్ - దేవెగౌడ - నవీన్ పట్నాాయక్ - ప్రకాశ్ సింగ్ బాదల్ స్టాలిన్ - ములాయం సింగ్ యాదవ్ - అఖిలేష్ యాదవ్ - మమతా బెనర్జీ - కేసీఆర్ - జగన్ వంటి నేతలందరికీ స్వయంగా ఫోన్ చేసిన మోడీ... 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబును కూరలో కరివేపాకులా తీసేయడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదట.

తనను విమర్శిచాన్ని పర్సనల్ గా తీసుకున్న మోడీ....2019 ఎన్నికల ప్రచారంలో బాబుపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచిన బాబు...అంటూ మోడీ ఘాటుగానే విమర్శించారు. అదే రీతిలో తనను కూడా బాబు మిత్ర ధర్మాన్ని విస్మరించి వెన్నుపోటు పొడిచారంటూ మోడీ బాగా ఫీలయ్యారట. ఈ రోజు బాబుకు ఫోన్ చేయకుండా ఉండడమే అందుకు నిదర్శనమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇటువంటి సందర్భాల్లో కొంచెం పట్టు విడుపు ఉండాలని...విపత్తు నిర్వహణలో బాబుకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలకు కొందరు సూచించారట. దానికి పగలబడి నవ్విన బీజేపీ నేతలు...బాబు అసలు బండారం బయటపెట్టారట. బాబుకున్నంత పబ్లిసిటీ పిచ్చి దేశంలో మరే నేతకూ లేదని బీజేపీ నేతలు అంటున్నారు.

పొరపాటున ప్రధాని ఫోన్ చేస్తే....కరోనాను కట్టడి చేయడంలో మోడీకి తానే సలహాలిచ్చానంటూ తన అనుయాయ మీడియాలో బాబు విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటారని బీజేపీ నేతలు అన్నారట. ఇక, బాబుకు విపత్తు నిర్వహణ తెలుసనుకోవడం భ్రమ అని....అది కూడా ఉత్త ప్రచారమేనని బీజేపీ నేతలు కొట్టిపారేశారు. విపత్తుల సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం, సిబ్బంది వ్యూహరచన చేస్తారని, దానిని బాబు తన ఖాతాలో వేసుకుంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందుకే, విపత్తుల సమయంలో బాబు ఒక్కరే మీడియా ముందుకు వచ్చి అర్ధరాత్రి ..అపరాత్రి కష్టపడుతున్నట్లు బిల్డప్ ఇస్తారని...కలెక్టర్లు ..అధికారులను మీడియా ముందుకు రానివ్వని చెప్పారు. ఒకవేళ ఎవరన్నా పొరపాటున మీడియా ముందుకు వచ్చినా...ఈ ప్లానింగ్ అంతా చంద్రబాబుదేనని చెప్పాలని ఆదేశాలుంటాయని చెప్పారు. అందుకే, బాబుకు మోడీ ఫోన్ చేయలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి, కొంచెం లేట్ గా అయినా...బాబుకు మోడీ ఫోన్ చేస్తారా లేదా...ఒకవేళ కూరలో కరివేపాకులా బాబును తీసేస్తే...దానిపై టీడీపీ నేతలు - బాబు రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.