లోకేష్ వర్సెస్ బొత్స.. ఇద్దరూ ఇద్దరే!

Thu Sep 19 2019 07:00:01 GMT+0530 (IST)

Nara Lokesh Vs Botsa Satyanarayana in Andhra Politics

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి బొత్స సత్యనారాయణ.. వీరిద్దరూ ఇద్దరూ ఇద్దరే! అని అంటున్నారు  నెటిజన్లు. వీరిద్దరి మాటలతీరు వీరు స్పందించే తీరు చూశాకా… వీరిద్దరూ పోటీ పడుతూ ఉన్నారని కామెంట్లు చేస్తూ ఉన్నారు.ఒకరికేమో నోరు తిరగదు మరొకరేమో పదాల కోసం తెగ వెదుక్కొంటారు.. ఇదీ పరిస్థితి అంటున్నారు సోషల్ మీడియా జనాలు. నోరు తిరగనిది నారా లోకేష్ బాబుకు. ఆ విషయం ఐదారేళ్లుగా జనాలకు అర్థం అవుతూనే ఉంది. పదాలను పలికేటప్పుడు అందులోని చాలా అక్షరాలను మింగేస్తాడు  లోకేష్ బాబు. షార్ట్ కట్ లో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నాలుక మందంలా లోకేష్ మాట్లాడుతూ ఉంటారు. దీంతో చాలా పదాలకు మీనింగులే మారిపోతూ ఉంటాయి.

రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలమే అయినా తెలుగుదేశం పార్టీ కి వారసుడుగా ప్రచారం పొందుతున్నా.. లోకేష్ మాత్రం తన తీరును ఇప్పటి వరకూ మెరుగు పరుచుకోలేదు. ఆఖరికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటమే మానేశాడు. మొహం చాటేసుకు తిరుగుతున్నారాయన.

ఇక అలాంటి లోకేష్ బాబు కు ధీటుగా బొత్స కూడా మాట్లాడుతూ ఉంటారు. బొత్స కూడా తను  చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పలేరు. పదాల కోసం తీవ్రంగా వెదుకులాడతారు. పదాలు దొరకక్క..తడబడుతూ ఉంటారు. తరచూ మీడియా ముందుకు వచ్చిన బొత్స ఈ విషయంలో మెరుగ్గాలేదు. ఇలా బొత్స సత్యనారాయణ నారా లోకేష్ ఇద్దరూ ఇద్దరే.. అని వీరు  మాట్లాడుతుంటే.. అసలు విషయం కన్నా తడబాటే ఎక్కువగా ఉంటుందని నెటిజన్లు జోకులేసుకుంటున్నారు.