వాటే క్రేజ్ : బాబుకు షాకిస్తున్న టూర్లు...?

Thu May 12 2022 23:00:01 GMT+0530 (IST)

Nara Chandrababu Naidu TDP

చంద్రబాబు రాజకీయ జీవితం తీసుకుంటే తానుగా ఎపుడూ గెలవలేదని వ్యూహాలను నమ్ముకుని విజయం సాధించారు అని ప్రత్యర్ధులు అంటారు. కానీ రాజకీయ   వ్యూహాలూ బాబు పట్ల అభిమానం అన్నీ కలసే టీడీపీని ఇప్పటికి అనేకసార్లు గెలిపించాయి. కానీ ఫస్ట్ టైమ్ 2024 ఎన్నికల్లో  చంద్రబాబు హయాంలో  టీడీపీని గెలిపించేది పాజిటివ్ ఓటింగ్ అని అంటున్నారు.అది కూడా కేవలం చంద్రబాబుని చూసే ఈసారి భారీ విజయం టీడీపీకి  దక్కుతుందని అంటున్నారు.  దానికి ఉత్తరాంధ్రా సెంటిమెంట్ నిండుగా టీడీపీకి కలసివచ్చింది. ఈసారి చంద్రబాబు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టిన బాదుడే బాదుడు టూర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఆ తరువాత విశాఖలోనూ అదే రిపీట్ అయింది. గోదావరి జిల్లాలలో కూడా జనాలు వెల్లువెత్తారు. దాంతో బాబే ఆశ్చర్యపోయారు. తనకు మంచి జన స్పందన కనిపిస్తోందని ఆయన మురిసిపోయారు. అయినా సరే ఇదంతా నిజమేనా అనేలా సీన్ ఉంది. కానీ బాబు సొంత నియోజకవర్గం కుప్పం టూర్ పెట్టుకుంటే అక్కడ కూడా ప్రజలు వెల్లువలా తరలి వచ్చారు.

సరే వారి సంగతి ఓకే అనుకున్నా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి చంద్రబాబు వెళ్తే అక్కడ విద్యార్ధులు అంతా రోడ్ల మీదకు వచ్చి బాబు రావాలి బాధలు పోవాలి అంటూ నినాదాలు చేయడం నిజంగా వండర్ కిందనే చూస్తున్నారు.  ద్రవిడ యూనివర్శిటీలో కనీస సదుపాయాలు లేవని ఎవరూ పట్టించుకోవడంలేదని తాము నానా అవస్థలు పడుతున్నామని విద్యార్ధులు గోడు వెళ్లబోసుకున్నారు.

మొత్తానికి చంద్రబాబుకు ఇంతలా క్రేజ్ అయితే ఆయన రాజకీయ జీవితంలో ఎపుడూ ఎవరూ ఊహించి ఉండరు. బాబు సైతం షాక్ తినేలా ఆయన టూర్లకు జనాలు వస్తున్నారు. బాబు పాలనను ఇపుడు సరిగ్గా బేరీజు వేసుకుంటున్నారా లేక తమ సమస్యలు కరోనా కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ప్రస్తుత పాలకుల మీద విసుగు వచ్చిందా అన్న చర్చ నడుస్తోంది.

ఏది ఏమైనా మూడేళ్ళుగా జగన్ తాడేపల్లికే పరిమితం కావడం బాబు మాత్రం టూర్ల మీద టూర్లు చేయడం కూడా ఇప్పటికి పనిని వచ్చింది అనే అంటున్నారు. బాబు కనుక ఈ ఊపులో ఏపీ  అంతటా తిరిగితే మాత్రం భారీ  మార్పు కచ్చితంగా వస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి చూడబోతే వైసీపీకి ఇవి ప్రమాద సంకేతాలు. అయినా సరే ఇంకా టైమ్ ఉంది. రెండేళ్ల దాకా అవకాశం ఉంది. కాబట్టి తప్పులను దిద్దుకుని వైసీపీ కనుక జనంలోకి వెళ్తే ఏమైనా మార్పు రావచ్చు. లేకపోతే మాత్రం 2024 ఎన్నికలు ఆసక్తికరంగానే  అనేక సంచలనాలు నమోదు చేసే విధంగానూ ఉంటాయని అనే విశ్లేషణలు ఉన్నాయి.