నారా బ్రాహ్మణి కొత్త లుక్.. హెరిటేజ్ సరికొత్త ప్రయోగం

Fri Nov 20 2020 11:15:58 GMT+0530 (IST)

Nara Brahmani new look .. Heritage newest experiment

రాజకీయ అధినేతల వారసుల తీరుకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంటారు లోకేశ్ సతీమణి.. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి. రాజకీయాలకు దూరంగా.. తన హెరిటేజ్ వ్యాపారంలో తలమునకలై ఉంటారు. అప్పుడప్పుడు బిజినెస్ ఫోరంలలో కనిపించే ఆమ.. తాజాగా కొత్త లుక్ తో సరికొత్త ఎంట్రీ ఇవ్వటం గమనార్హం. హెరిటేజ్ సంస్థ నుంచి సరికొత్త ప్రొడక్ట్ విడుదలైంది. దీని గురించి వివరిస్తూ.. బ్రాండ్ అంబాసిడర్ మాదిరి దర్శనమిచ్చారు నారా బ్రాహ్మణి.తాజాగా హెరిటేజ్ సంస్థ రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద లక్షణాలున్న అశ్వగంధ పాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పాలతో పాటు అశ్వగంధ ఆయుర్వేద మూలికల్ని కలిపి తీసుకోవటం ఎప్పటి నుంచో ఉందని చెబుతున్న ఆమె.. తమ తాజా ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ఫోటోలకు ఫోజులివ్వటం గమనార్హం. తమ ఉత్పత్తుల్ని పరిచయం చేసే వేళ.. కొత్త లుక్ లో నారా బ్రాహ్మణి ఆకట్టుకున్నారు.

హెరిటేజ్ లేబుల్ ఉన్న షర్ట్ తో బ్రాహ్మణి ఫోటోలకు ఫోజులిచ్చారు. తాము కొత్తగా విడుదల చేస్తున్న ప్రొడక్టు గురించిన వివరాల్ని మాత్రమే వెల్లడించినా.. ఈ ప్రచార ఫోటోల్ని చూసినంతనే బ్రాహ్మణినే కొట్టొచ్చినట్లుగా కనిపిస్తారు. తాము మార్కెట్లోకి తీసుకొచ్చిన అశ్వగంధ పాలలో ఎలాంటి కృత్రిమ నిల్వ పదార్థాల్ని కలపలేదని పేర్కొన్నారు. ప్రొడక్టుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నా.. గతంలో ఏ వస్తు ప్రచారానికి ఇంతలా బ్రాహ్మణి శ్రద్ధ తీసుకోలేదంటున్నారు. ఏమైనా.. కొత్త లుక్ లో బ్రాహ్మణి ఆకర్షణీయంగా.. ఆకట్టుకునేలా ఉన్నారని చెప్పాలి.