Begin typing your search above and press return to search.

హిమాలయాల్లోకి నారా బ్రాహ్మణి.. ఏం చేసిందో చూస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   1 Dec 2022 3:14 AM GMT
హిమాలయాల్లోకి నారా బ్రాహ్మణి.. ఏం చేసిందో చూస్తే అవాక్కే
X
ప్రముఖ అగ్రహీరో నందమూరి బాలయ్య కూతురు.. టీడీపీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అద్భుతమే చేశారు. అస్సలు సంబంధం లేని ఓ సాహసయాత్రను చేపట్టారు. రాజకీయ, సినీ కుటుంబంలో లోప్రొఫైల్ మెయింటేనే చేసే బ్రాహ్మణి ఇలా చేసిందని తెలియగానే అందరూ నోరెళ్ల బెట్టారు. ఇప్పటివరకూ ఒక గృహిణిగా.. వ్యాపారవేత్తగా మాత్రమే మనకు బ్రాహ్మణి తెలుసు. కానీ ఆమె అభిరుచికి అనుగుణంగా ఇలాంటి సాహసయాత్రలు చేస్తుందన్న విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నాం.

బైక్ ట్రావెలర్ అంటే నారా బ్రాహ్మణికి చాలా ఇష్టమట.. అడ్వెంచర్లు చేయడం అంటే సరదా అంటా.. ఈ విషయం బయటకు చెప్పకున్నా ఆమె ఎన్నో సార్లు చేసింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా చేసింది. కానీ ఎవరైతే ఈ సాహసయాత్రను ఆర్గనైజ్ చేసి నిర్వహించిన కంపెనీ విడుదల చేసిన వీడియోలో నారా బ్రాహ్మణి కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ వీడియోను షేర్ చేస్తూ నారా బ్రాహ్మణి సాహసానికి కొనియాడుతున్నారు.

హిమాలయాల్లో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని లేహ్-లడఖ్‌లో అందమైన పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇప్పుడు ఈ శీతాకాలం మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. వీటిని ప్రకృతి ప్రేమికులు కనీసం ఒక్కసారైనా సందర్శించాలని చూస్తారు.

తాజాగా నారా బ్రాహ్మణికి కూడా ఇవి సందర్శించడమే కాదు.. ఏకంగా బైక్ రైడింగ్ నిర్వహించి ఆశ్చర్యపరిచినట్టు సమాచారం. ప్రస్తుతం బ్రాహ్మణి బైక్ పై ఈ సాహసయాత్ర చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లేహ్ పర్వత శ్రేణులలో బ్రాహ్మణి బైక్ ట్రిప్‌ను చేసినట్టు చెబుతున్నారు.

వీడియోలో బ్రాహ్మణి అక్కడ అందమైన సూర్యోదయం గురించి మాట్లాడుతుంది. అక్కడ థిక్సే మఠం అందించే ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ప్రస్తావించింది. ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే బ్రాహ్మణి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బైక్ ట్రిప్‌కు వెళ్లడం. శారీరకంగా సవాళ్లతో కూడుకున్న ఈ జర్నీలో ముందుకు సాగిందంటే అందరూ మెచ్చుకోకతప్పదు. ఆమె సాహసానికి సెల్యూట్ చేయాల్సిందే. ముఖ్యంగా మహిళ నుంచి ఇంత పెద్ద సాహసాన్ని చేయడంపై నెటిజన్లు అభినందిస్తున్నారు.

హెరిటేజ్ గ్రూప్‌ను నడిపించే విజయవంతమైన వ్యాపారవేత్తగా బ్రహ్మణి పేరు పొందింది. పలు సేవా కార్యక్రమాలను కూడా చేస్తోంది. హెరిటేజ్ సంస్థలో పనిచేస్తున్న పేద కార్మికుల పిల్లలకు చదువు కోసం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఆమె తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

అయితే అంతటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో బ్రాహ్మణి బైక్ రైడింగ్ చేసిందా? లేక వారికి సపోర్టుగా మద్దతుగా నిలిచిందా? అన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ గ్రూపులో పలువురు మహిళలు కూడా బైక్ రైడింగ్ చేసినట్టు వీడియో చూస్తే కనిపిస్తోంది. దీనిపై నారా బ్రాహ్మణి మాత్రం అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు బయటా ఎక్కడా ప్రస్తావించలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.