దేవాన్ష్ తో కలిసి బ్రాహ్మణి మెట్రో ప్రయాణం.. ఎందుకు?

Sun Aug 18 2019 16:17:32 GMT+0530 (IST)

Nara Brahmani and Son Devansh Take Hyderabad Metro Ride

హైదరాబాద్ మెట్రో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యల కారణంగానో.. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు జర్నీ చేయటం కారణంగానో వార్తలు వస్తుంటాయి. దీనికి భిన్నంగా ఈ రోజున టీడీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు.. మహిళా పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి ఈ రోజు మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు.తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి ఆమె మొట్టమొదటిసారి మెట్రోలో జర్నీ చేశారు.  జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లోని మెట్రో స్టేషన్లో కుమారుడితో కలిసి వచ్చి మెట్రోరైలెక్కిన ఆమెను చూసిన వారంతా.. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ నుంచి లక్డీకాఫూల్ వరకూ ఆమె మెట్రోలో ప్రయాణించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి.. దేవాన్ష్ లకు సంబంధించిన వీడియోలను భద్రతాధికారులు తొలగించారు. ఐదు రోజుల క్రితమే అమరావతి నుంచి చంద్రబాబు ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చారు. లక్డీకాఫూల్ లో దగ్గర్లో జరిగే ఒక ప్రైవేటు కార్యక్రమంలో హాజరయ్యేందుకు బ్రాహ్మణి మెట్రోలో ప్రయాణించారు. లక్డీకాపూల్ కు చేరినంతనే సిద్ధంగా ఉన్న వాహనంలో ఆమె వెళ్లిపోయారు. బ్రాహ్మణి.. దేవాన్ష్ లను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.