Begin typing your search above and press return to search.

షాకింగ్ః ఒకే చోట 50ల‌క్ష‌ల సమాధులు

By:  Tupaki Desk   |   12 July 2016 3:02 PM GMT
షాకింగ్ః ఒకే చోట 50ల‌క్ష‌ల సమాధులు
X
వ్య‌క్తి చనిపోయిన త‌ర్వాత ఖ‌న‌నం చేయ‌డం అనే ప‌లు సంప్ర‌దాయాల్లో ఉన్న అల‌వాటు ద్వారా వారి శ్మ‌శాన‌వాటిక‌ల్లో స‌మాధులు పెద్ద సంఖ్య‌లోనే ఉంటాయి. ఇవి మ‌హా అయితే వంద‌లు, ఇంకా భారీగా ఉంటే వేల‌ల్లో ఉంటాయి. కానీ ల‌క్ష‌ల్లో ఉండ‌టం అది కూడా ఏ వైపు చూసినా స‌మాధులు మాత్ర‌మే క‌నిపిస్తే.... షాకింగ్ లాగా ఉంటుంది క‌దా?ఇరాక్ రాజధాని బాగ్ధాద్ కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని నజాఫ్ పట్టణం ఇదే త‌ర‌హా రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ఇక్క‌డ‌ 50 లక్షల స‌మాధులు ఉన్నాయి. అంతేకాదు ఏటా కొత్తగా 5 లక్షల సమాధులు నిర్మిస్తున్నారు. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి కాబ‌ట్టే ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానంగా రికార్డులకెక్కింది.

ఇంత‌కీ న‌జాఫ్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద శ్మ‌శాన వాటికగా గుర్తింపు పొంద‌డం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థే ఉంది. శాంతి లోయ అనే అర్థం వ‌చ్చేలా ఈ వదీ అల్ సలామ్ పేరుతో ఉన్న ఈ న‌గ‌రానికి ఉన్న చ‌రిత్ర ప్ర‌కారం ముస్లింలోని ఒక వ‌ర్గ‌మైన షియాల‌కు చెందిన మూడో అతిపెద్ద పవిత్ర నగరంగా నజాఫ్ గతంలో ప్రాచుర్య పొందింది. వారి మొదటి మతగురువు - నాలుగో ఖలీఫా అయిన అలీ ఇబిన్ అబి తాలిబ్ ను నజాఫ్ లోనే ఖననం చేశారు. అందుకే ఈ ప్రదేశాన్ని షియాలు పవిత్ర లోయగా భావిస్తారు. మత గురువు సమాధి చేసిన ప్రాంతం కాబట్టి ఇక్క‌డ ఖ‌న‌నాలు పెరిగిపోయాయి. కాలక్రమంలో కొత్త సమాధులు భారీగా నిర్మించుకుంటూ పోవడంతో ఇప్పుడు సమాధుల సఖ్య 50 లక్షలకు పైనే ఉన్నాయి. వీటికి ఏటా ఐదు ల‌క్ష‌లు జ‌త అవుతున్నాయి.

ఇదిలాఉండ‌గా ...ముస్లింలలోని మ‌రో వ‌ర్గ‌మైన సున్నీల వ‌ల్ల ఈ న‌గ‌రం ధ్వంసం అయింది. అంత‌ర్జాతీయ రాక్ష‌స మూఠా అయిన‌ ఐసిస్ ను న‌డిపించేది సున్నీ ముస్లింలే. త‌మ ఉనికిని చాటుకోవ‌డంలో భాగంగా న‌జాఫ్ న‌గ‌రంపై దాడుల‌కు తెగ‌బ‌డి మొత్తం నామ‌రూపాలు లేకుండా చేశారు. అయితే సెంటిమెంట్‌ ను గౌర‌వించి శ్మశానాన్ని మాత్రం వదిలేశారు.