Begin typing your search above and press return to search.

మ‌ల్లారెడ్డి మన మంత్రి కావ‌డం ఖ‌ర్మ‌..నాయిని సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   28 Jan 2020 4:47 PM GMT
మ‌ల్లారెడ్డి మన మంత్రి కావ‌డం ఖ‌ర్మ‌..నాయిని సంచ‌ల‌నం
X
టీఆర్ ఎస్ పార్టీ సీనియర్‌ నాయకుడు - మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సుదీర్ఘ కాలం త‌ర్వాత మీడియా ముంద‌కు వ‌చ్చి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశౄరు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాయిని నరసింహరెడ్డి అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ...కార్మిక శాఖ మంత్రిగా మ‌ల్లారెడ్డి ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. ఆయ‌న మంత్రి కావ‌డం...ప్రజలు చేసుకున్న పాపమని మండిప‌డ్డారు.

కార్మికులు ఇబ్బందులు పడుతోంటే మంత్రి పట్టించుకోకుండా ఉంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజల పక్షాలన చేయాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కార్మికులు సమ్మెలు కూడ చేసే పరిస్థితి కూడ లేకుండా పోయిందన్నారు. కాగా, నాయిని చేసిన వ్యాఖ్య‌లు సంచ‌లనంగా మారాయి.

ఇదిలాఉండ‌గా నాయిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై గుర్రుగా ఉన్నార‌ని స‌మాచారం. శాసనసభ ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే - ఎమ్మెల్సీగానే ఉంటే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి...అనంత‌రం మంత్రివర్గంలో తనను పక్కకు పెట్టడంపై ఆయ‌న అసంతృప్తిగా ఉన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లను కాదని - ఇతరులకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మనోగతాన్ని వెల్లడించేందుకు సీఎంను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మనస్తాపం చెందారు.