రెబెల్ రాజు గారి కోసం నాగబాబు భారీ త్యాగం

Mon Jan 23 2023 20:39:56 GMT+0530 (India Standard Time)

Nagababu made a huge sacrifice for the raghu rama krishnam raju

కొణిదెల నాగబాబు ఉరఫ్ మెగా బ్రదర్ ఉరఫ్ జనసేనలో   ప్రస్తుతం కీలకమైన నేత. నాగబాబు రాజకీయం 2019లో డైరెక్ట్ గా నర్సాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేయడంతో స్టార్ట్ అయింది. ఆ ఎన్నికల్లో 250289 ఓట్లు తెచ్చుకుని వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రఘురామ క్రిష్ణం రాజుకు దడ పుట్టించారు నాగబాబు. దాంతో జస్ట్ 31909 ఓట్లతోనే రాజు గారు గెలవగలిగారు. ఆ తరువాత ఆయన వైసీపీకి రెబెల్ ఎంపీగా మారారు.అదే సమయంలో తెలుగుదేశానికి జనసేనకు దగ్గర అయ్యారు.ఆ స్నేహ బంధం ఇపుడు ఆయనకు  బాగా ఉపయోగపడబోతోంది అని అంటున్నారు. ఏపీలో జనసేన తెలుగుదేశానికి మధ్య పొత్తులు కుదిరినట్లే అని తెలుస్తోంది. ఆ పొత్తుల వల్ల నర్సాపురం సీటు తెలుగుదేశానికి వెళ్ళిందని అంటున్నారు. తెలుగుదేశం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఈ మధ్య బాగా పేరు తెచ్చుకున్న రెబెల్ రాజు గారు 2024లో మరోసారి నర్సాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు.

ఆయన కనుక అక్కడ నుంచి పోటీ చేస్తే 2019లో జనసేన నుంచి పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబు ఖాళీ అవుతారు. ఆయనకు మరో సీటు లేదు అని అంటున్నారు. నిజానికి పొత్తు వల్ల నాగబాబు నర్సాపురం లోక్ సభ నుంచి పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. అపుడు ఆయన గెలుపు నల్లేరు మీద నడక అని కూడా భావించారు. కానీ ఇపుడు తెలుగుదేశం ఆ సీటు తీసుకుని రెబెల్ రాజు గారికి ఇస్తామని చెబుతోంది.

దానికి బదులుగా జనసేనకు ఒక బిగ్ ఆఫర్ ని ప్రకటించింది అని అంటున్నారు. 2025లో వచ్చే రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని నాగబాబుకు ఇచ్చి ఆయన్ని ఎంపీగా చేస్తారు అని అంటున్నారు. అందువల్లనే నాగబాబు కర్నూల్ టూర్ లో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. పార్టీ పటిష్టత మీదనే తన దృష్టి అని కూడా ఆయన పేర్కొన్నారు. అంటే ఆయన త్యాగానికి సిద్ధపడే ఈ మాటలు అన్నారని అంటున్నారు. కొన్నాళ్ళు ఆగితే ఈ పొత్తు ఫలించి తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే తాను పెద్దలసభలో కూర్చోవచ్చు అన్నదే నాగబాబు మాటల వెనక మనోగతం అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే  ఈ బిగ్ డీల్ కుదరడంతో రెండు పార్టీలు హ్యాపీగా ఉన్నాయని అంటున్నారు. అందరి కంటే ఎక్కువగా రెబెల్ ఎంపీ రాజు గారు ఫుల్ ఖుషీ అని అంటున్నారు. ఆయన వరసబెట్టి రెండవసారి నర్సాపురం నుంచే పోటీ చేసి గెలిస్తే కనుక జగన్ మీద భారీ విజయం సాధించామని చెప్పుకోవడానికి వీలుంటుంది. 2019లో గెలిచి మళ్ళీ 2024 వరకూ తన నియోజకవర్గానికి రాని రాజు గారు గెలిస్తే కనుక అది రాజకీయంగా మరో రికార్డుకు కూఒడా దారి తీసే పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.