Begin typing your search above and press return to search.

40 ఏళ్ళకు మొదటి దెబ్బ పడింది : నాగబాబు

By:  Tupaki Desk   |   14 Jan 2020 11:38 AM GMT
40 ఏళ్ళకు మొదటి దెబ్బ పడింది : నాగబాబు
X
ఏపీలో రాజధాని రగడ ఇంకా కొనసాగుతుంది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలన్న రైతుల పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. రాజధాని రైతుల కోసం పోరుబాట పట్టాయి. ఇక మూడు రాజధానులు ముద్దు అని వైసీపీ నేతలు రాజధాని దీక్షలకు పోటీగా ర్యాలీలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో రాజధాని విషయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక ఇదే సమయంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఇక ఈ నేపధ్యంలో తాజాగా రాజధాని అమరావతి రైతులను బాధ పెట్టిన వారికి తప్పకుండా ఉసురు తగిలి తీరుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు. ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని ఒక వ్యవస్థ గాని బాలన్స్ తప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళల్లో మోరల్ డౌన్ అయినట్లు అని ఆయన తెలిపారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉందని ఆయన విమర్శలు గుప్పించారు .వాళ్ళ మోరల్ టోటల్ గా డౌన్ అయ్యిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి అంటూ నాగబాబు వైసీపీ నేతలు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని అన్నారు.

ఈ వ్యాఖ్యలు తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ అసభ్య పదజాలం ఉపయోగించి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అంతే కాదు ఏపీకి ఏల్నాటి శని పట్టిందని చెప్పారు. ప్రస్తుతం ఏపి స్టేట్ కి ఏలిన నటి శని కాలమే జరుగుతుందన్నారు . ఇక ఇది ఇంకా 7 సంవత్సరాలు ఉంటుందని ఆయన తెలిపారు.

టీడీపీ హయం లో రైతులని మభ్యపెట్టి రాజధాని పేరుతో వాళ్ళ జీవితాల తో ఆడుకోవడం మొదలు లెట్టటంతో ఏల్నాటి శని మొదలైందన్న నాగబాబు ఇక ప్రస్తుతం వైసీపీ ప్రభుతంతో ఏల్నాటి శని పీక్స్ లోకి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. అన్నదాతలైన రైతుల ఉసురు మంచిది కాదని పేర్కొన్న ఆయన రైతులంటే వైసిపి వాళ్ల కి లోకువ అని మండిపడ్డారు .వాళ్ళ ని, వాళ్ల మనోభావలని, అవమానించిన వాళ్ళకి ఉసురు తగలడం మొదలైనదని అంతలోనే చంద్రబాబుని టార్గెట్ చేశారు . చంద్రబాబుకు ఇంతకాలానికి 40 ఏళ్ళకి మొదటి దెబ్బపడిందని నాగబాబు .