భారత న్యాయవ్యవస్థకు హ్యాట్సాఫ్: నాగబాబు

Fri May 29 2020 16:00:25 GMT+0530 (IST)

Nagababu Responds on About High Court Reaction on Nimmagadda Ramesh Kumar

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.  న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.తాజాగా హైకోర్టు తీర్పుపై జనసేన నేత - మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘భారత న్యాయవ్యవస్థకు హ్యాట్సాఫ్.. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది ’ అని ట్వీట్ చేశారు.

చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016 జనవరి 30న ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకం అయ్యారు.  ఏపీ సీఎంగా జగన్ వచ్చాక 2020 ఏప్రిల్ 10న ఆయనను తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు.  ఆ ఆర్డినెన్స్ చెల్లదని కొట్టి వేస్తూ ఆయనను తిరిగి నియమించాలని తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై నాగబాబు హర్షం వ్యక్తం చేశారు.