Begin typing your search above and press return to search.

మన జేమ్స్ బాండ్ ఎంట్రీతో డ్రాగన్ వెనక్కి తగ్గిందా?

By:  Tupaki Desk   |   7 July 2020 5:30 AM GMT
మన జేమ్స్ బాండ్ ఎంట్రీతో డ్రాగన్ వెనక్కి తగ్గిందా?
X
గడిచిన కొద్ది రోజులుగా భారత్ - చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాను చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేని రీతిలో వ్యవహరిస్తున్న డ్రాగన్ దేశం దొంగ ఎత్తులతో దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో భారత్ - చైనాల మధ్య సైన్యం తరలింపు.. ఆయుధాల మొహరింపు లాంటి పరిణామాలతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా చైనా వెనక్కి తగ్గి.. తన సైనాన్యాన్ని ఐదారు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన వైనంపై వార్తలు వచ్చాయి.

ఎవరి మాట వినకుండా.. తనకు తోచినట్లు చేసే చైనా తీరును ప్రభావితం చేసిందెవరు? ఎవరి కారణంగా చైనా తాజాగా వెనక్కి తగ్గే నిర్ణయం తీసుకుందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. భారత జేమ్స్ బాండ్.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఎంట్రీతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. విదేశీ వ్యవహారాల తో పాటు.. కొన్ని అంశాల్ని డీల్ చేయటం లో డోభల్ తర్వాతే ఎవరైనా అన్న మాటలకు తగ్గట్లే.. ఈసారి ఆయన చేతలు ఉన్నాయని చెప్పక తప్పదు.

చైనా విదేశాంగ మంత్రితో సమావేశమైన అజిత్ డోభాల్ తాజా ఉద్రిక్తల్ని కొంత మేర తగ్గించారని చెప్పాలి. ఆయన జరిపిన సమావేశ ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లో తమ బలగాల ఉపసంహరణ కు ఓకే చెప్పింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో రెండు గంటల పాటు ఫోన్ లో మాట్లాడిన మాటలు తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు. ఈ ఫోన్ కాల్ లో చైనా విదేశాంగ మంత్రిపై ఒత్తిడి తీసుకు రావటమే కాదు.. చైనా సైన్యం వెనక్కి తగ్గేలా చేయటం లో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.

అంతేకాదు.. భవిష్యత్తు లో డోక్లామ్ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మాట ఇరు దేశాల మధ్య వచ్చిందని చెబుతున్నారు. డోభల్ తో చర్చలు జరిపినట్లు గా చైనా సైతం ధ్రువీకరించింది. ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. ఫోన్ కాల్ పూర్తైయిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా సైనికులు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ‘శాంతి పునరుద్ధరణ కోసం ఎల్ఏసీ వెంట ఉన్న సైనిక బలగాల్ని పూర్తి స్థాయి లో సరిహద్దుల నుంచి వెనక్కి రప్పించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి’’ అని విదేశాంగ ప్రకటన విడుదలైన కొన్ని గంటల వ్యవధి లోనే ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించేందుకు వీలుగా బలగాల ఉపసంహరణ కు నిర్ణయం తీసుకున్నాం. సైనిక, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకునేందుకు భారత్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ఆ దిశగా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం’’ అంటూ చైనా నుంచి ప్రకటన రావటమే కాదు.. తమ సైనిక బలగాల్ని వెనక్కి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవటం చూస్తే.. భారత జేమ్స్ బాండ్ ఫోన్ కాల్ పుణ్యమే తాజా పరిణామాలు అని చెప్పక తప్పదు.