Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ స‌హా దేశ‌వ్యాప్తంగా ఎన్ ఐ ఏ జ‌ల్లెడ‌.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   29 Nov 2022 12:30 PM GMT
ఏపీ, తెలంగాణ స‌హా దేశ‌వ్యాప్తంగా ఎన్ ఐ ఏ జ‌ల్లెడ‌.. రీజ‌న్ ఇదే!
X
దేశ‌వ్యాప్తంగా ఎన్ ఐ ఏ సోదాలు ముమ్మ‌రం చేసింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామునుంచే అనేక రాష్ట్రాల్లో సోదాలు జ‌రుగుతున్నాయి. దీనికి కార‌ణం.. గ్యాంగ్స్టర్లకు, తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకేన‌ని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ‌, ఏపీతో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్స్టర్ల స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు.

గ్యాంగ్స్టర్లకు, తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా పలువురు గ్యాంగ్స్టర్ల ఇళ్లల్లో అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే యాంటీ టెర్రర్ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియాతో పాట గోల్డీ బ్రార్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అక్టోబర్‌లో నాలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోని 52 ప్రదేశాలలో ఎన్ఐఏ విస్తృత సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సోదాల్లో ఆసిఫ్ ఖాన్ అనే న్యాయవాదితో పాటు హరియాణాకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ను అధికారులు అరెస్టు చేశారు.

ఉస్మాన్పుర్లోని గౌతమ్ విహార్కు చెందిన న్యాయవాది ఆసిఫ్ ఖాన్ ఇంట్లో జరిపిన సోదాల్లో నాలుగు ఆయుధాలతో పాటు పలు పిస్టోళ్లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. న్యాయవాదికి.. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్లతో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో రుజువైంది.

అయితే, ఏపీలోని క‌ర్నూలు, తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లోనూ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఎన్ ఐఏ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.