రాజ్యసభ డిప్యూటీ చైర్మన్..హైదరాబాద్ లో పనిచేశాడు

Thu Aug 09 2018 16:08:51 GMT+0530 (IST)

అన్నివర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఫలితం వెలువడిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్.. విపక్షాల అభ్యర్థి బి.కె. హరిప్రసాద్ పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరివంశ్ నారాయణ్ సింగ్ కు 122 ఓట్లు.. బి.కె. హరిప్రసాద్ కు 105 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్ ఎస్ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయగా.. టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసింది.. కాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ కు ప్రధాని అభినందనలు తెలియజేశారు.ఎన్డీఏ కూటమి అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన నేపథ్యంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు

- హరివంశ్ స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ లోని భలియా. మధ్యతరగతి కుటుంబంలో 1956 జూన్ 30న జన్మించారు

-బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ పట్టా అందుకున్నారు

- కెరియర్ ప్రారంభంలో నెలకు రూ. 500 వేతనానికి పనిచేశారు

- పలు న్యూస్ సంస్థలకు ఎడిటర్ గా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించారు.

- హైదరాబాద్ ఆర్ బీఐలో కొన్నాళ్లు పనిచేశారు

- సోషలిస్ట్ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో 1974లో జేపీ చేపట్టిన ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్నారు

- 1977లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ జర్నలిస్ట్ గా చేరారు. అనంతరం ముంబయికి మారి ధర్మయుగ్ మ్యాగజైన్ లో 1981 వరకు పనిచేశారు

- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1981 నుంచి 1984 వరకు

- అనంతరం అమృత్ బజార్ పత్రిక మ్యాగజైన్ రవివార్‌కు అసిస్టెంట్ ఎడిటర్ గా - ప్రభాత్ కబర్ కు ఎడిటర్ గా 25 ఏళ్లుగా పనిచేశారు.

- నితిశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ హరివంశ్ ను 2014లో రాజ్యసభకు నామినేట్ చేసింది.

- జేడీయూ జనరల్ సెక్రటరీ ఇన్ ఛార్జీగా వ్యవహరించారు

- మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.