డ్రగ్స్ కేసు: దావూద్ సోదరుడు అరెస్ట్

Wed Jun 23 2021 22:11:45 GMT+0530 (IST)

NCB Places Underworld Don Brother under arrest

నరరూప రాక్షసుడు ముంబై బాంబుపేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం దేశం విడిచి వెళ్లినా.. ఆయన మనషులు సోదరులు ఇతర సన్నిహితులు మాత్రం ఇప్పటికీ ముంబైలో దందా చేస్తున్నారన్న ప్రచారం అక్కడ జోరుగా సాగుతోంది. తాజాగా దావూద్ సోదరుడు అరెస్ట్ తో మరోసారి వారి ఉనికి ఉందని  మరోసారి బయటపడింది.కరుడుగట్టిన మాఫియా డాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. డ్రగ్స్ కేసులో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ గత కొంతకాలంగా డ్రగ్స్ కేసుపై దర్యాప్తు జరుపుతోంది. ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్స్ కు మాఫియాతో సంబంధాలున్నాయని దావూద్ సోదరుడే సూత్రధారి అని తేలింది.పాకిస్తాన్ కు నిధులు సమకూర్చేందుకు దావూద్ సోదరుడైన ఇక్బాల్ కస్కర్ బాలీవుడ్ నటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కస్కర్ ను అరెస్ట్ చేశారు.

ముంబైలో పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంటున్నాడు. అతడి కోసం ఆయన సోదరుడు కస్కర్ పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి అరెస్ట్ తో మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముంది.