క్షమాపణలు చెప్పాల్సిందే.. భారత న్యూస్ చానెళ్లకు నోటీసులు

Mon Oct 26 2020 22:00:27 GMT+0530 (IST)

NBSA Directs Times Now To Air Apology To Sanjukta Basu

భారత టీవీ న్యూస్ చానళ్ల స్వతంత్ర సంస్థ ‘న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్స్ అథారిటీ’ (ఎన్.బీ.ఎస్.ఏ) గత రెండు రోజుల్లో చాలా నోటీసులు జారీ చేసింది. కొన్ని టీవీ న్యూస్ చానళ్లు తాముచేసిన తప్పులకు బహిరంగ క్షమాపణలు కోరాలని ఎన్.బీ.ఎస్.ఏ ఆదేశించింది.వీటిలో ప్రముఖ న్యూస్ చానల్ ‘టైమ్స్ నౌ’ కూడా ఉంది. అక్టోబర్ 27న రాత్రి 9 గంటలకు క్షమాపణలు అడగాలని ఎన్.బీ.ఎస్.ఏ సూచించింది.

టైమ్స్ నౌ 2018 ఏప్రిల్ 6న ప్రసారం చేసిన ఒక కార్యక్రమంలో రచయిత సామాజిక కార్యకర్త సంయుక్తా బసుకు తప్పుడు ఇమేజ్ ఆపాదించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సంయుక్తకు తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని తేలింది. టౌమ్స్ నౌ తనను ఒక కార్యక్రమంలో హిందూ వ్యతిరేకిగా.. భారత సైన్యానికి వ్యతిరేకిగా.. రాహుల్ గాంధీ ట్రోల్ ఆర్మీ సభ్యులుగా చెప్పారని ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే సంయుక్త చేసిన ఫిర్యాదు మేరకు ఎన్.బీ.ఎస్.ఏ టైమ్స్ నౌ చానల్ కు నోటీసులు జారీ చేసింది. తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరానని.. దాని గురించి వారు తనకు ఎలాంటి సూచన ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఏకపక్షంగా ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఈ కేసులో ఇప్పుడు టైమ్స్ నౌ క్షమాపణ కోరాలని ఎన్.బీఎస్ఏ చెప్పింది. పాత కార్యక్రమం యూట్యూబ్ సోషల్ మీడియా మిగతా ఏ మీడియంలో అందుబాటులో ఉన్నా ఏడు రోజుల్లో డిలీట్ చేయాలని టీవీచానెల్ కు సూచించింది.