చంద్రుడిపై నీళ్లున్నాయి.. నాసా సంచలన ప్రకటన

Tue Oct 27 2020 14:22:36 GMT+0530 (IST)

There is water on the moon .. NASA sensational announcement

చంద్రమండలం మీద అడుగుపెట్టడం.. అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలన్నది మానవుల కల.. ఇందు కోసం దశాబ్దాలుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు జాబిల్లిపై కాలు మోపారు. కానీ అక్కడ జీవించడానికి అనువైన వాతావరణం ఉన్నదా? లేదా? అన్న విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సంచలన విషయాలను వెల్లడించింది. చంద్రుని సూర్యరశ్మి ఉపరితలంపై నీరు ఉందని నాసా ప్రకటించింది.దీంతో చంద్రమండలం మొత్తం నీటిని పంపిణీ చేయవచ్చని పేర్కొన్నది. ఒక ముఖ్యమైన ద్యోతకం అంతేగాక ఇది ధ్రువాలు వంటి దాని చల్లని నీడ ఉన్న ప్రదేశాలకు మాత్రమే పరిమితం కాదని పేర్కొంది.

వ్యోమగాములకు ఇది గుడ్న్యూస్..

చంద్ర మండలం వద్దకు వెళ్లే వెళ్లే వ్యోమగాములకు ఇది శుభవార్తేనని అంతరీక్ష పరిశోధకులు చెబుతున్నారు. నీరు ( హెచ్2వో) చంద్రమండలంపై నీటి ఆనవాళ్లు కనిపెట్టామని వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలోని సైన్స్ మిషన్ డైరెక్టరేట్‌లోని ఆస్ట్రోఫిజిక్స్ విభాగం డైరెక్టర్ పాల్ హెర్ట్జ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

‘చంద్రుడిపై గుర్తించిన నీటి ఆనవాళ్లు భవిష్యత్లో పరిశోధలకు ఎంతో ఉపయోగపడతాయి. కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రారంభించేందుకు ఉపకరిస్తాయి’ అని నాసా మానవ అన్వేషణ కార్యకలాపాల మిషన్ డైరెక్టరేట్ ప్రధాన అన్వేషణ శాస్త్రవేత్త జాకబ్ బ్లీచర్ పేర్కొన్నారు.