షాకింగ్ : భూమి వైపు వేగంగా వస్తున్న తోకచుక్క!

Sat Jul 11 2020 16:20:01 GMT+0530 (IST)

Shocking: The comet coming fast to the earth!

సాధారణంగా ఓ తోక చుక్క భూమి వైపు దూసుకురావడం చాలా అరుదుగా జరుగుతుంది. అప్పటి రోజుల్లో హేలీ అనే ఓ తోకచుక్క భూమివైపు చాలా వేగంగా దూసుకొచ్చినట్టు మనం చదువుకున్నాం. కానీ తాజాగా మరో తోకచుక్క భూమివైపు దూసుకొస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించి వెల్లడించారు. అయితే గతవారం రోజుల క్రితం ఈ తోక చుక్క బుధగ్రహం కక్ష్యను దాటి సూర్యుని వైపుగా పయనిస్తునట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.అయితే ఆ తర్వాత ఈ తోకచుక్క తన దిశను మార్చుకొని సూర్యునికి అటువైపుగా వెళ్లకుండా అక్కడి నుంచి దిశ మార్చుకొని భూమివైపు వస్తున్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోని నియోవైజ్ శాటిలైట్ ద్వారా గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ తోకచుక్క ఐదు కిలోమీటర్ల పొడువు ఉండటంతో మనకళ్ళతో కూడా చూడొచ్చని అంటున్నారు

వచ్చే వారం ఈ తోక చుక్క భూమివైపుగా ప్రయాణం చేస్తుందని రాత్రి వేళ ఉత్తరంవైపు ఆకాశంలో సూర్యాస్తమయం తరువాత సూర్యోదయం ముందు స్పష్టంగా కనిపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపింది. వచ్చే వారం నుంచి ఈ నెల మొత్తం ఈ తోకచుక్క ఆకాశంలో కనిపిస్తుంది అని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.