బ్రేకింగ్: అంతరిక్షంలో మరో జీవి ఉనికి?

Fri Aug 23 2019 11:37:26 GMT+0530 (IST)

Mysterious Signals Keep Coming From Deep In Our Galaxy,

హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాం.. అందులో వింతైన అంతరిక్ష జీవులను చూసి సంభ్రమాశ్చార్యాలకు గురి అవుతుంటాం. ఇటీవలే వచ్చిన ‘అవెంజర్స్ ’ మూవీలో కూడా అంతరిక్ష జీవులకు మానవులకు యుద్ధం జరుగుతుంది. అందులోని వింతైన అంతరిక్ష వాసులను చూసి అబ్బురపడ్డాం. మరి నిజంగా అదంతా సినిమా మాయేనా? లేక నిజంగానే అంతరిక్ష జీవులున్నాయా? అని అనుమానించాం..  ఉంటే వారు ఎక్కడున్నారు.? కానీ ఇప్పుడు అంతరిక్ష జీవుల ఉనికి లభించింది. ఈమేరకు శాస్త్రవేత్తలకు అందిన సంకేతాలు ఇప్పుడు అంతరిక్ష జీవి ఉనికిని నొక్కిచెబుతున్నాయి.‘ఫాస్ట్ రేడియో బర్మ్స్ (ఎఫ్ ఆర్బీ)’.  మన భూమి - సూర్యుడు ఉన్న పాలపుంత(గేలాక్సీ) నుంచి కాకుండా వేరే ఇతర గేలాక్సీ నుంచి భూమిపైకి వచ్చిన సంకేతాలకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఇదీ..  తాజాగా భూమిపైకి కొన్ని అర్థం కాని సంకేతాలు అందుతున్నాయని అంతరిక్ష పరిశోధకులు తాజాగా తేల్చారు. కెనడాలోని హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ టెలిస్కోప్ ఈ సంకేతాలను గ్రహించిందట.. సో ఇప్పుడు ఈ సంకేతాలను బట్టి సూర్యమండలం అవతల అంతుచిక్కని జీవి ఉందని.. ఇది వేరే గెలాక్సీ నుంచే ఈ సంకేతాలు పంపాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ అంతుచిక్కని సంకేతాల గుట్టు విప్పేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.

కెనడా దేశంలోని టెలిస్కోపులకు సువిశాల అంతరిక్ష కేంద్రం నుంచి ఈ సంకేతాలు వచ్చాయట.. వీటిని విశ్లేషించే పనిలో ఇప్పుడు శాస్త్రవేత్తలు పడ్డారు. డీకోడ్ చేసి తేల్చడానికి రెడీ అయ్యారు.

ఈ పరిణామంతో మన సువిశాల విశ్వంలో సూర్యమండలం ఆవల ఎక్కడో గెలాక్సీలో జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు.

2007లో కూడా ఇలానే జరిగింది. అప్పుడు విశ్వం నుంచి దాదాపు ఎనిమిది రకాల వేర్వేరు సంకేతాలు (ఎఫ్ఆర్బీలు) సిగ్నల్ రిసీవర్లలో నమోదయ్యాయి. మన గెలాక్సీ ఆవల అనంత విశ్వంలోని ఇతర గెలాక్సీ నుంచి ఇవి వచ్చినట్టు శాస్త్రవేత్తలు విశ్లేషణలో వెల్లడించారు. అయితే ఇప్పటీకీ దాన్ని ఆ సంకేతాల రహస్యం ఏంటన్నది డీకోడ్ చేయలేకపోయారు.

అసలు భూమి సూర్యకుటుంబానికి ఆవల ఉన్న కోట్ల గెలాక్సీలో జీవులున్నాయా? వారే ఇలా సంకేతాలు పంపారా? మరి ఎందుకు పంపించారు? అసలు మానవుల కంటే అత్యాధునిక టెక్నాలజీని వారు వాడుతున్నారా? మనకంటే బలవంతులా.. అసలు ఈ అనంత విశ్వంలో వారు ఎక్కడున్నారన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. శాస్త్రవేత్తలకు అందిన సంకేతాలను బట్టి విశ్వంలో మానవులే కాదు.. ఇతర జీవులు సూదురంలో ఉన్నారని అనుమానిస్తున్నారు.