Begin typing your search above and press return to search.

సైనికులకు దిమ్మ తిరిగే షాకిచ్చేలా మయన్మార్ మహిళల ఎత్తుగడ

By:  Tupaki Desk   |   7 March 2021 9:30 AM GMT
సైనికులకు దిమ్మ తిరిగే షాకిచ్చేలా మయన్మార్ మహిళల ఎత్తుగడ
X
ప్రస్తుతం మయన్మార్ లో సైనిక పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వారి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలపటం.. ఇలాంటి వారిని అణిచివేసేందుకు పాలకులు సైన్యాన్ని ప్రయోగించటం తెలిసిందే. నిరసనకారుల్నిపిట్టల మాదిరి కాల్చేస్తున్న వైనం ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సైనికులు జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఏ నిమిషాన పోలీసులు.. సైన్యం తమ మీద విరుచుకుపడతారో అర్థం కాని ఆందోళనాకారులు.. నిరసనకారులు సరికొత్త ఎత్తుగడ వేశారు. వీధుల్లోనూ.. రోడ్ల మీద అడ్డంగా బట్టలు ఆరేశారు. ఎందుకిలా? అంటే దానికోపెద్ద స్టోరీ ఉందని చెబుతున్నారు. మయన్మార్ లో ఉన్న ఆచారం ప్రకారం ఆరేసిన బట్టల కింద నుంచి నడిస్తే.. బ్యాడ్ లక్ వెంటాడుతుందన్న నమ్మకం చాలా ఎక్కువ. అందుకే.. పోలీసుల్ని.. సైన్యాన్ని అడ్డుకునేందుకు నిరసనకారులు ఈ ఎమోషనల్ ఎత్తును ప్రయోగిస్తున్నారు.

ఇక్కడి మహిళలు రోడ్లపై ఆరేస్తున్న దుస్తుల్లో లోంగ్యీ కీలకం. ఇది మహిళలు నడుము చుట్టు కట్టుకునే వస్త్రం. ఒక విధంగా చెప్పాలంటే మన లుంగీ లాంటిది. దీన్నిఆరేసిన వాటి కింది నుంచి నడిస్తే తమ లక్ ను కోల్పోతామన్న నమ్మకం ఎక్కువ. ఇప్పటితరం ప్రజల్లో ఇలాంటిది తక్కువే అయినా.. పోలీసులు.. సైన్యంలో మాత్రం ఈ సెంటిమెంట్ ఎక్కువ. దీంతో.. ఇలా వస్త్రాలు ఆరేసిన వైపునకు సైనిక పాలకుల చెప్పు చేతల్లో నడిచే భద్రతా సిబ్బంది దూసుకొచ్చే సాహసం చేయరు. దీంతో.. నిరసనకారులు వారి బారి నుంచి తప్పించుకునే వీలు చిక్కుతుంది. ప్రస్తుతానికి ఈ ఎత్తుగడతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతకాలం నడుస్తుందో చూడాలి.