నా తల్లికి బెడ్ దొరకడం లేదు: బోరుమన్న ఎమ్మెల్యే

Tue May 04 2021 14:05:58 GMT+0530 (IST)

My mother is serious Says Congress MLA Kusuma Shivalli

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్లి కంటతడిపెట్టారు. సోమవారం ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ లు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే శివళ్లి ఒక్కసారిగా బోరుమన్నాడు.తన తల్లి కరోనా బారిపడ్డారని.. పరిస్థితి సీరియస్ గా ఉందని.. కనీసం ఆస్పత్రిలో ఒక బెడ్ కూడా ఇప్పటించలేకపోతున్నానని ఎమ్మెల్యే రోదించడం కాంగ్రెస్ నేతలను కంటతడి పెట్టించింది.

వెంటనే స్పందించిన మాజీ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడుతానని భరోసానిచ్చాడు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని.. రామరాజనగర్ లో కరోనా బాధితులు ఆక్సిజన్ లభించక 24మంది మృతిచెందారని అన్నారు.

ఇటువంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. బాధితులకు అవసరమైన సేవలు కల్పించాలని కోవిడ్ బాధితులలో ధైర్యం నింపాలని సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు భరోసా కల్పించారు.