వెంటిలేటర్ పై మహేంద్ర(23) ప్రాణాలతో పోరాడుతున్నాడు... సాయం చేయండి

Wed Jul 15 2020 18:00:30 GMT+0530 (IST)

My Nephew Mahendra Is Fighting For His Life And We Need Your Support To Save Him

ప్రకాశం జిల్లా పి.సి.పల్లి కి చెందిన పల్లె మహేంద్ర (23) మధ్యతరగతికి చెందిన యువకుడు. అందరు యువకుల్లాగే ప్రయోజకుడై కన్న తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలని అనుకున్నాడు. తనను కంటికి రెప్పలా పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రుల కలను నెరవేరుద్దామనుకున్నాడు. సాఫీగా సాగిపోతున్న మహేంద్ర జీవితం అనుకోకుండా ఒక రోజు అనూహ్య మలుపు తిరిగింది. మహేంద్రను విధి చిన్న చూపు చూసింది. దురదృష్టవశాత్తూ మహేంద్ర జూన్ 30 2020న యాక్సిడెంట్ కు గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో మహేంద్ర స్పృహ కోల్పోయాడు. ఈ వార్త విన్న మహేంద్ర కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. మహేంద్రను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే తీవ్రంగా గాయపడి తలకు బలమైన గాయం తగలడంతో మహేంద్రకు అత్యవసరంగా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్ విజయవంతం అయింది. కానీ మహేంద్రకు ప్రాణాపాయం పూర్తిగా తొలగిపోలేదు.గత 15 రోజులుగా మహేంద్ర ఐసీయూలో  వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతున్నాడు. జ్వరం కామెర్లతో మహేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. యాక్సిడెండ్ వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది. మహేంద్ర రక్తంలోని ప్లేట్ లెట్ల సంఖ్య కూడా తగ్గుతోంది. కాబట్టి ప్రతిరోజు కొత్తగా ప్లేట్ లెట్లను ఎక్కించాల్సి వస్తోంది. రోజురోజుకు మహేంద్ర చికిత్స కోసం ఖర్చు పెరిగిపోతోంది. మహేంద్ర పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స కోసం చాలా డబ్బు అవసరం. ఈ పరిస్థితి ఎవరికి వచ్చినా....ఆ సమయంలో వారు కోరుకునేది ఆపన్న హస్తం...ఆర్థిక సాయం. ఇటువంటి విపత్తు వచ్చినపుడు ఏ కుటుంబమైనా ఆర్థికంగా చితికిపోతుంది. మహేంద్ర తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం ఉన్నదంతా ఖర్చుపెట్టారు. ఉన్నదానితోపాటు అప్పు సప్పు చేసి ఇప్పటివరకు అయిన చికిత్సకు దాదాపుగా రూ.5లక్షలు ఖర్చుపెట్టారు.

మహేంద్రకు చికిత్స కొనసాగించడానికి...మహేంద్ర పూర్తిగా కోలుకోవడానికి మరో రూ.5 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారు. ఇపుడు తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు దాతల విరాళాలకోసం మహేంద్ర తల్లిదండ్రులు మేనమామ వంశీధర్ ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం...కన్న కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం దాతలు తోచినంత విరాళం అందించాలని వారు ప్రార్థిస్తున్నారు. చికిత్స కొనసాగించి మహేంద్ర పూర్తిగా కోలుకొని మామూలు జీవితం గడపాలంటే మీవంటి దయార్థ హృదయులైన దాతల సాయం కావాలి. ఈ కష్ట సమయంలో మహేంద్ర కోసం అతడి మేనమామ నూకతోటి వంశీధర్ విరాళాలు సేకరిస్తున్నారు. వంశీధర్ చేపట్టిన ఈ ఫండ్ రైజింగ్ కు మీ వంతు సహకారం అందించండి. మహేంద్రకు ప్రాణదానం చేయండి. మీరు దానం చేసే అతి కొద్ది మొత్తం...ప్రతీ రూపాయి కూడా మహేంద్ర వైద్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. ఆర్థిక సాయంతో పాటు మహేంద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. వ్యక్తిగతంగా మహేంద్ర కు మీవంతు సాయం అందించండి. ఈ ఫండ్ రైజింగ్ లింక్ ను మీ కుటుంబ సభ్యులు స్నేహితులు...ఇలా వీలైనంత ఎక్కువమందికి షేర్ చేయండి.

ఇట్లు

మహేంద్ర తల్లిదండ్రులు మేనమామ నూకతోటి వంశీధర్ స్నేహితులు శ్రేయోభిలాషులు 

మహేంద్రకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి షేర్ చేయండి.


*Donate Now to save mahendra's life....help Nukathoti Vamsidhar*


https://www.ketto.org/fundraiser/my-nephew-is-fighting-for-his-life-and-we-need-your-support-to-save-him-214516?utm_source=internal&utm_medium=whatsappShare&utm_content=d83f0fd73bb67421a9c1aee8e303fd47&shby=1&utm_campaign=my-nephew-is-fighting-for-his-life-and-we-need-your-support-to-save-him-214516&payment=form