Begin typing your search above and press return to search.

ముంబయి సెవన్ హిల్స్ ఆసుపత్రి తీపికబురు.. కోవిడ్ ను అలా గెలవొచ్చట

By:  Tupaki Desk   |   2 Aug 2020 4:10 AM GMT
ముంబయి సెవన్ హిల్స్ ఆసుపత్రి తీపికబురు.. కోవిడ్ ను అలా గెలవొచ్చట
X
మనకు బాగా తెలిసిన పనే. కానీ.. కొన్నిసార్లు మర్చిపోతుంటాం. కాలగమనంలోనూ.. బతుకు తీరులోనూ మార్పు రావటంతో.. గతంలో చేసిన మంచి పనుల్ని గుర్తుంచుకోం. కరోనా లాంటి విపత్తు వేళ.. ఇలాంటివి కొందరు గుర్తిస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక విషయాన్ని గుర్తించారు ముంబయిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలోని వైద్యులు. కొన్ని దశాబ్దాల క్రితం వైద్యరంగం ఇంతలా డెవలప్ కాని సమయంలో.. ఇంట్లోనే ఉండి వైద్యం చేసుకునే మన పెద్దోళ్లు కొన్ని సందర్భాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం చాలామందికి గుర్తుండే ఉంటుంది.

సీజన్ మారిన వెంటనే.. అందునా వర్షాకాలం.. శీతాకాలాల్లో వేడినీళ్లలో విక్స్ లేదంటే అమృతాంజన్‌ లేదంటే జండూబాబ్.. కాదంటే జిందా తిలిస్మాత్ లలో ఏదో ఒకదాన్ని.. పసుపు వేసి బలంగా ఆవిరి పట్టటం చేస్తుండేవారు. తర్వాతి కాలంలో ఈ విధానాన్ని వదిలేశారు. అయితే.. ఈ పాత పద్దతిని సరికొత్తగా విరుచుకుపడిన కోవిడ్ కు అద్భుతమైన మందుగా చెబుతున్నారు. తామీ విషయాన్ని గుర్తించినట్లుగా ముంబయిలోని సెవన్ హిల్స్ దవాఖానా స్పష్టం చేస్తోంది.

రోజూ ఇదే తీరులో ఆవిరి పట్టటం వల్ల ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వారు ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని.. ఒకవేళ సాధారణ.. మధ్యస్థ లక్షణాలు ఉన్న వారుఅయితే పది రోజుల్లో ఈ పద్దతిని ఫాలో అయితే కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ విధానాన్ని తాము ప్రాక్టికల్ గా అమలు చేశామని వెల్లడించారు. కోవిడ్ లక్షణాలు లేని వారిని.. ఉన్న వారిని వేర్వేరుగా రెండు గ్రూపులుగా చేశామని.. మొదటి గ్రూపు రోజుకు రెండుసార్లు ఐదు నిమిషాల పాటు ఆవిరిపట్టేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

రెండో గ్రూపు మాత్రం ప్రతి మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టేలా చేశామని.. ఇలా 14 రోజుల నుంచి రెండు నెలల పాటు పరిశీలిస్తే.. ఇలా ఆవిరి పట్టే వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదని చెప్పారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు వారం నుంచి పది రోజుల్లో ఆవిరి పట్టటం ద్వారా కోలుకున్న వైనాన్ని గుర్తించామని.. అదే మధ్యస్త లక్షణాలు ఉన్న వారైతే రెండు వారాల్లో కోలుకున్నారని చెబుతున్నారు. కరోనా వచ్చే వరకూ ఆగటం ఎందుకు.. ఈ ప్రయత్నమేదో.. కొద్ది కాలం పాటు తరచూ చేస్తే.. మాయదారి వైరస్ ను దగ్గరకే రాకుండా చేసుకోవచ్చు కదా?