మహిళ గొంతుకోసి .. మృతదేహాంపై అత్యాచారం

Sun Jul 05 2020 05:00:05 GMT+0530 (IST)

Mumbai Murder Case

ఈ సమాజంలో ఆడవారికి అసలు రక్షణ అనేదే లేకుండాపోతుంది. కొందరు మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా  ఓ వ్యక్తి తన దుకాణంలో షాపింగ్ చేసేందుకు వచ్చిన మహిళను గొంతు కోసి చంపాడు.  ఆ తరువాత ఆమె మృత దేహంపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ముంబై లో వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... ముంబై నగరంలోని నలసోపారాకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ జూన్ 26న ఇంటిలో నుంచి కిరాణ సామగ్రి తెచ్చేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన పిల్లలకు బొమ్మలు కొనేందుకు ఆ మహిళ ఓ బొమ్మల దుకాణంలోకి వెళ్లింది. అక్కడ రేటు   విషయంలో మహిళా దుకాణ యాజమానితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆగ్రహంతో ఊగి పోయిన ఆ షాప్ యజమాని మహిళ ను జుట్టు పట్టుకని దుకాణం వెనుక ఉన్న గది లోకి లాక్కెళ్లాడు. మహిళ అరుస్తుండగా గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత శవం పై  లైంగిక దాడి చేశాడు.

అనంతరం మహిళ మృత దేహాన్ని ఓ వ్యాను లో ఎక్కించి రహదారి పక్కన ఆపేశాడు. అయితే మహిళ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పాల అమ్ముకుని జీవనం సాగించే ఆమె భర్త నలసోపారాలోని తులింగ్ పోలీసులకు తన భార్య తప్పి పోయిందని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.