Begin typing your search above and press return to search.

విస్తరిస్తున్న మరో కొత్త వ్యాధి .. హెచ్చరించిన అమెరికా !

By:  Tupaki Desk   |   10 Aug 2020 11:30 AM GMT
విస్తరిస్తున్న మరో కొత్త వ్యాధి .. హెచ్చరించిన అమెరికా !
X
కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..ఇప్పుడు ఇదే మాట ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచం లోని అన్ని దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా భారిన పడిన వారి సంఖ్య 2 కోట్లు దాటిపోయింది. అలాగే కరోనా వెలుగులోకి వచ్చి .. నెలలు గడుస్తున్నా కూడా కరోనాను వ్యాక్సిన్ కనిపెట్ట లేకపోతున్నారు. చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో ఎవరికీ తెలియడం లేదు.

ఈ నేపథ్యంలో అమెరికా మరో హెచ్చరిక చేసింది. అమెరికాలో కరోనాతో పాటు మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ గుర్తించింది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లల్లో అధికంగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జ్వరంగా మొదలయ్యే ఈ వ్యాధి తరువాత శరీరంలోని మిగతా భాగాలను దెబ్బతీస్తోందని, ఈ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, చర్మంపై దద్దుర్లు, గుండెల్లో మంట వంటివి కనిపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువుగా ఈ లక్షణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అమెరికాతో పాటుగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ లో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికా వెల్లడించింది. అమెరికాలో ఇప్పటి వరకు 600 పిల్లలకు ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా 10 మంది మరణించినట్టు అమెరికా సీడీసీ సంస్థ వెల్లడించింది.