Begin typing your search above and press return to search.

దేశంలో - 34శాతం జీడీపీ.. కానీ ముఖేష్ అంబానీ షేర్ వాల్యూ 200శాతం పెరుగుదల?

By:  Tupaki Desk   |   23 Sep 2020 2:00 PM GMT
దేశంలో - 34శాతం జీడీపీ.. కానీ ముఖేష్ అంబానీ షేర్ వాల్యూ 200శాతం పెరుగుదల?
X
కరోనా లాక్ డౌన్ తో అన్ని దేశాల వ్యవస్థలు కుప్పకూలాయి. భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది.దేశంలో 2018లో +8శాతం జీడీపీ ఉండేది. కానీ అది క్రమేపీ 2019లో +3,-4శాతానికి చేరింది. ఇప్పుడు కరోనా మహమ్మారి ధాటికి అధికారికంగా -24శాతానికి దిగజారిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆర్థిక వేత్తలు మాత్రం -34శాతం వరకు ఉండవచ్చని అంటున్నారు.

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారత్ లో పెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన ముఖేష్ అంబానీ విలువ మాత్రం +200శాతం ఎలా పెరిగిందనేది అందరికీ అంతుబట్టడం లేదు. దేశం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అంత గ్రోత్ ఎలా సాధ్యమైందనేది వాళ్లే చెప్పాలి..

ఎందుకంటే ముఖేష్ అంబానీకి ఉన్న మెయిన్ బిజినెస్ ‘జీయో మరియు క్రూడ్ ఆయిల్ బిజినెస్’. రెండు బిజినెస్ లు కూడా కోవిడ్ ఎఫెక్ట్ తో ఢీలా పడిపోయాయి. మరి అంబానీ ఆదాయం +200శాతం ఎలా పెరిగిందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని మేధావులు ప్రశ్నిస్తున్నారు. అంత పెరిగితే అదే మాదిరిగా జీడీపీ కూడా పెరగాలి కదా అని కౌంటర్ ఇస్తున్నారు.

దేశ జీడీపీ తగ్గినప్పుడు పర్సనల్ బిజినెస్ ఉన్న ముఖేష్ అంబానీ షేర్ వాల్యూ +200 ఎలా పెరుగుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. దాని వెనుక పెద్ద ఎత్తున కుంభకోణం కూడా ఉన్నది అని కూడా మేధావులు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు కాకుండా కార్పొరేట్ కంపెనీలకు పనిచేస్తోందని కూడా ఒక వాదన.. విమర్శ వినిపిస్తోంది.

అమెరికాలో ఉన్న కంపెనీలు అన్నీ నష్టాల్లో ఉన్నా రిలయన్స్ రిటైల్ బిజినెస్ లో వాళ్లు ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు? ఇదంతా ఒట్టి లెక్కలు చెప్పి రిటైల్స్ ట్రేడర్స్ నుంచి పెద్ద ఎత్తున షేర్లు కొనిపించే కార్యక్రమం అని.. రిటైల్స్ షేర్ ట్రేడర్ ఇవి అన్ని నమ్మకండని కూడా యూట్యూబ్ లో కొందరు అనాలిస్టులు చెప్తున్నారు.

ఏది ఏమైనా దేశంలో ఉన్న పేద ప్రజలు బాగుండాలి కానీ.. కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వం పనిచేయకూడదు అని ఎక్కడ చూసినా దేశంలో మేధావులు ఇదే కోరుకుంటున్నారు.