Begin typing your search above and press return to search.

వరుసగా 9వ సారి.. దేశంలో కుబేరుడిగా అంబానీ

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:31 PM GMT
వరుసగా 9వ సారి.. దేశంలో కుబేరుడిగా అంబానీ
X
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితాను ‘హురున్ రిచ్’ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ నిలిచారు. ఇక భారత్ లోని నంబర్ 1 కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలిచారు.

ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితా విడుదలైంది. ‘ఐఐఎఫ్ఎల్’ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 9వ సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలవడం విశేషం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ భారత్ లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆగస్టు 31తో గడిచిన 12 నెలల కాలంలో అంబానీ ఆసక్తి 73శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ పేర్కొంది.

ప్రస్తుతం అంబానీ సంపద రూ.6.58 లక్షల కోట్లకు చేరింది. రెండో స్థానంలో హిందుజా సోదరులు ఉండగా.. మూడో స్థానంలో శివ్ నాడార్ కుటుంబం ఉంది.

ఇక 1000 కోట్లకు మించిన సంపద ఉన్న 828 మందిని ఐఐఎఫ్ఎల్ పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే దేశంలోనే అంబానీ నంబర్ 1 స్థానంలో నిలిచారు.