అంబానీ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా.. ఎందుకంటే!

Tue Jun 28 2022 21:00:02 GMT+0530 (IST)

Mukesh Ambani Paves Way For Entry Of Young Blood Into Reliance

పారిశ్రామిక దిగ్గజం జియో అధినేత ముఖేష్ అంబానీ.. జియో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ రాజీనామా వెనుక రీజన్ ఆసక్తిగా మారింది. రిలయన్స్ జియో పగ్గాలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ముకేశ్.. జూన్ 27న రాజీనామా చేశారని సంస్థ స్టాక్మార్కెట్లకు ఇచ్చిన ఫైలింగ్స్లో వెల్లడించింది. అదేరోజు జరిగిన సమావేశంలో ఆకాశ్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలిపింది.ఆకాశ్.. ఇప్పటివరకు రిలయన్స్ జియోలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 2014లో జియో బోర్డులో చేరారు. అదేసమ యంలో జియో మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ను నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జూన్ 27నే ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వివరించింది. మరోవైపు రమీందర్ సింగ్ గుజ్రాల్ కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు స్పష్టం చేసింది. అయితే జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్‌కు ముకేశ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ముకేశ్ అంబానీ తన వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పగించే ప్రణాళికలో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ముకేశ్ అంబానీ తన రాజీనామాను మంగళవారం ప్రకటించినపప్పటికీ... అది నిన్నటి(సోమవారం)నుంచే అమల్లోకి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్... అంబానీ రాజీనామా జూన్ 27 నుండే అమల్లోకి వచ్చినట్లు మంగళవారం ప్రకటించింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీని బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు సంస్థ ప్రకటించింది. ఇక ఆకాష్ స్థానంలో... జూన్ 27 నుంచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

 డైరెక్టర్ల బోర్డ్ తీసుకున్న నిర్ణయాల మేరకు.. (ఏ) వాటాదారుల ఆమోదానికి లోబడి 27 జూన్ 2022 నుండి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాల కాలానికి ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమితులైన రమీందర్ సింగ్ గుజ్రాల్ కేవీ చౌదరి నియామకాలకు ఆమోదం. (బీ) వాటాదారుల ఆమోదానికి లోబడి... సోమవారం(27 జూన్) నుండి ప్రారంభమైన ఐదు సంవత్సరాల కాలానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ నియామకానికి ఆమోదం. (సీ) కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ ఎం అంబానీ నియామకానికి ఆమోదముద్ర వేశారు.