వీడియో : చావుకు వెళ్లి బంధువులను ఓదార్చే కోతి

Sat Apr 20 2019 15:37:36 GMT+0530 (IST)

Monkey Consoles Woman At Karnataka Funeral

శుభకార్యంకు వెళ్లినా వెళ్లకున్నా కూడా చావుకు మాత్రం తప్పకుండా వెళ్లాలి అంటారు పెద్దలు. చనిపోయిన వ్యక్తితో ఎంత గొడవలు ఉన్నా పగ ఉన్నా కూడా వెళ్లి చివరి చూపు చూసి రావడంతో పాటు చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించడం కనీస ధర్మంగా అంతా భావిస్తారు. ఏప్రిల్ 19 అంటే నిన్న కర్ణాటక రాష్ట్రంలోని నార్గుండ్ కు చెందిన 80 ఏళ్ల ఒక వృద్దుడు మృతి చెందాడు. అతడి మృతితో కుటుంబ సభ్యులు మరియు బంధువులు అంతా కూడా శోక సంద్రంలో మునిగి పోయారు. ఆ సమయంలోనే అక్కడకు ఒక కోతి వచ్చింది.కోత్తి వచ్చి కోతి పనులు చేస్తే ఇప్పుడు ఈ విషయం గురించి మనం చర్చించుకోనవసరం లేదు. కాని ఆ కోతి నేరుగా వెళ్లి చనిపోయిన వృద్దుని ముందు కొన్ని సెకన్లు కూర్చుని వృద్దుని శవం ముందు ఏడుస్తున్న ఒక మహిళ బుజం తట్టి ఆ తర్వాత తలపై చేయి వేసి ఓదార్చడం జరిగింది. ఈ సంఘటనతో అక్కడున్న వారు అంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కోతులు జనాల మద్యలోకి రావడమే చాలా గగనంగా చెప్తారు. అయితే ఆ కోతి వచ్చినా కూడా అంతా అలాగే ఉన్నారు. అంతలోనే ఆ కోతి ఆమె వద్దకు వెళ్లి ఓదార్చడం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ కోతి కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఎక్కడ ఏడుపు వినిపించినా కూడా అక్కడకు వెళ్లి ఓదార్చుతుందని గతంలో కూడా పలు చోట్ల ఇలా ఓదార్చింది అంటూ స్థానికంగా చర్చ జరుగుతుంది. ఈ కోతి మనిషిలా ప్రవర్తించి మనిషి ఫీలింగ్స్ ను కనబర్చడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. హనుమాన్ జయంతి రోజు ఇలా జరగడంతో మరింతగా చర్చకు తెర లేపుతోంది. స్థానికంగా ప్రతి చావు ఇంటికి కూడా కోతి వస్తుందని కోతి వచ్చి ఓదార్చిన తర్వాతే అంత్యక్రియలు చేస్తున్నట్లుగా కొందరు అంటున్నారు. ఇది వినేందుకు కాస్త వింతగా ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే మాత్రం నమ్మాల్సిందే.