చంద్రబాబుకి వ్యతిరేకంగా కలెక్షన్ కింగ్ ధర్నా

Thu Mar 21 2019 23:53:59 GMT+0530 (IST)

Mohan Babu Ready to Protest Against Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుంది. ఎన్నికల ఏదైతే జరగకూడదో అలాంటివి అన్నీ వరసపెట్టి చంద్రబాబుకి ఎదురు అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతితో సతమతమవుతున్న చంద్రబాబుకి.. ఇప్పుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రూపంలో మరో ఎదురుదెబ్బ తగలబోతుంది. చంద్రబాబు వైఖరికి నిరసనగా తిరుపతి తన విద్యార్థులతో ధర్నా చేసేందుకు మోహన్ బాబు సిద్ధం అవుతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి సమీపంలో మోహన్ బాబు ఓ కాలేజీని నడుపుతున్న సంగతి అందరికి తెలిసింది. ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఈ కాలేజీకి రావాల్సిన బకాయిల్ని టీడీపీ ప్రభుత్వం రిలీజ్ చెయ్యండం లేదు. ఈ ఐదేళ్లలో ఫీజు రీ యింబర్స్ మెంట్ బకాయిలు మొత్తం కలిపి రూ.16 కోట్లు వరకు ప్రభుత్వం నుంచి మోహన్ బాబు కాలేజీకి రావాల్సి ఉంది. చంద్రబాబుకు మోహన్ బాబు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం.. వైసీపీ దగ్గరకు దగ్గరగా ఉండడం లాంటి కారణాల వల్ల బిల్లులు ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపణలు వస్తున్నాయి దీంతో.. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా తిరుపతిలో కాలేజీ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు మోహన్ బాబు.
          
“మాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మేం ఏమైనా బిచ్చగాళ్లమా అడుక్కోవడానికి. ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాం. కానీ మా రిక్వెస్ట్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ తాలూకూ డబ్బులు కరెక్ట్ గా వచ్చేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం హయాంలో మాత్రం  చాలా సమస్యల్ని ఎదుర్కుంటున్నాం” అని అన్నారు మోహన్ బాబు.