బ్యానర్ తెచ్చిన తంటా ...కర్నూల్ వైసీపీ లో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే

Mon Feb 17 2020 12:15:22 GMT+0530 (IST)

Mohammad hafeez Khan vs SV Mohan Reddy

కర్నూలు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విబేధాలు బయటపడ్డాయి. కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా వివాదం చెలరేగుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి ఆ తరువాత టీడీపీ ఆకర్ష్ లో ..టీడీపీ లో జాయిన్ అయ్యారు. కానీ మళ్లీ ఎన్నికల సమయానికి ముందు వైసీపీ లో జాయిన్ అయ్యారు. కానీ తాజాగా 2019 ఎన్నికల్లో కర్నూల్ నుండి హఫీజ్ ఖాన్ వైసీపీ నుండి బరిలోకి దిగి విజయం సాధించారు.అయితే హఫీజ్ ఖాన్ విజయం సాదించినప్పటి నుండి వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో యుద్ధం జరుగుతుంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు అంటూ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎస్వీ మోహన్ రెడ్డి సమక్షం లో కొందరు వైసీపీలోకి జాయిన్ అయిన సమక్షంలో ఎమ్మెల్యే ఈ విదంగా కామెంట్స్ చేయడం కర్నూల్ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.

ఇకపోతే వివాదం ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతున్న సమయం లో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మరో వివాదం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి బ్యానర్లని అర్ధరాత్రి సమయం లో తొలగించడం తో ఇద్దరు నేతల మధ్య ఉన్న మనస్పర్థలు మరోసారి బయపడ్డాయి. అసలు కర్నూల్ లో ఏంజరిగింది అంటే .. కర్నూల్ సిటీలో ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి కి సంబంధించిన బ్యానర్లని అర్ధరాత్రి సమయంలో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులని ..బ్యానర్లని ఎందుకు తొలగించారంటూ నిలదీయడం తో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేము తొలగించాము అని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం ... పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరు నేతల వివాదాలు తారా స్థాయి కి చేరడం తో ఆ విషయం సీఎం జగన్ వద్దకి వెళ్లనుంది. చూడాలి మరి సీఎం జగన్ ఈ ఇద్దరి నేతల మధ్య సంధి ఏ విదంగా కుదుర్చుతారో ....