Begin typing your search above and press return to search.

మోడీ, అమిత్ షా.. మౌనమేలనోయి!

By:  Tupaki Desk   |   13 Nov 2019 5:30 PM GMT
మోడీ, అమిత్ షా.. మౌనమేలనోయి!
X
మహారాష్ట్ర.. దేశానికి ఆర్థిక రాజధాని ఉన్న రాష్ట్రం. దేశానికి దక్కే ఆదాయంలో మహారాష్ట్ర భాగం భారీగా ఉంటుంది. వర్తక, వాణిజ్యాలకు రాజధాని అయిన ముంబై మహానగరాన్నే మహారాష్ట్ర రాజధానిగా కలిగి ఉంది. ఇలాంటి నేపథ్యంలో అలాంటి చోట అధికారం మరింత రుచితో కలిగి ఉండే అంశం!

మిగతా రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఒక ఎత్తు, మహారాష్ట్రలో అధికారం మరో ఎత్తు. అందుకే అక్కడ పార్టీలు కూడా బహుముఖంగా తలపడుతూ ఉంటాయి. ఎవరికి వారు కొన్ని కొన్ని సీట్లతోనే రాజకీయాన్ని నెరుపుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి బీజేపీ చేజారింది!

ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ- శివసేనలు కలిసి పోటీ చేయడం, మినిమం మెజారిటీని సాధించడం, ఆ తర్వాత బీజేపీ సీఎం సీటు విషయంలో పట్టుబడటం, అదే స్థాయిలో శివసేన కూడా పట్టుబడటం.. చివరకు ఇద్దరికీ అవకాశం దక్కకపోవడం తెలిసిన సంగతే.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. అంత జరుగుతున్నా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రముఖులు మాత్రం మారు మాట్లాడలేదు. వారు కామ్ గా ఉన్నారు. వారెవరో కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ,బీజేపీ జాతీయాధ్యక్షుడు కమ్ హోం మినిస్టర్ అమిత్ షా.

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల గురించి వారు స్పందించిన దాఖలాలే లేవు. శివసేనకు సర్ధి చెప్పడానికో, రాజీ చేయడానికో కూడా వారిద్దరూ ముందుకు రాకపోవడం విశేషం. అలా ఎందుకు జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతూ ఉంది. మహరాష్ట్రను వారిద్దరూ లైట్ తీసుకున్నారా? లేక కామ్ గా ఉండే మొత్తం వ్యవహారాన్ని లోలోపల నుంచి నడిపిస్తున్నారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం.