Begin typing your search above and press return to search.

వైసీపీకి పరిషత్ దెబ్బ..8 ఎమ్మెల్సీలు ఖాళీ అయినా ఎన్నికల్లేవ్

By:  Tupaki Desk   |   18 Jun 2021 7:30 AM GMT
వైసీపీకి పరిషత్ దెబ్బ..8 ఎమ్మెల్సీలు ఖాళీ అయినా ఎన్నికల్లేవ్
X
ఏపీ శాసనమండలిలో బలం పుంజుకుందామంటే అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఏపీ శాసనమండలిలో స్తానిక సంస్థల కోటా కింద గతంలో ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీలు ఇవాళ పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో ఏడుగురు టీడీపీ సభ్యులు కాగా.. ఒకరు వైసీపీ సభ్యుడు. వీరితోపాటు గతంలో ఖాళీ అయిన మరో ముగ్గురు ఎమ్మెల్సీలను కలుపుకొని మొత్తం 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు వెంటనే జరిగే అవకాశాలు లేవు.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు కావడంతో వైసీపీకి ఇప్పుడు సమస్యగా మారింది. ఈ ఎన్నికలు జరిగి ఉంటే ఎమ్మెల్సీ 8 సీట్లు వైసీపీ ఖాతాలో పడేవి. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగే వరకు కూడా సీట్లు భర్తీ కావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.

ఏపీలోని శాసనసభ లో 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ భీకరంగా ఉన్నా.. శాసనమండలిలో మాత్రం బలం పుంజుకోవడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు బలంగా ఉన్నారు. ఇప్పుడు వారు పదవీ విరమణ చేయడంతో వైసీపీ బలం పెరుగుతోంది. టీడీపీ బలం తగ్గిపోతోంది.

తాజాగా ఇవాళ 8మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయబోతున్నారు. ఇందులో ఏడుగురు టీడీపీ, 1 వైసీపీ సభ్యులే. వీరిలో అత్యధికులు టీడీపీ వారే. ఈ స్తానాలన్నీ వైసీపీ ఖాతాలో పడేవి. ఎన్నికలు జరిగి ఉంటే 8 సీట్లు గెలుచుకొని మండలిలో జగన్ బలం పుంజుకునేవారు.

మండలిలో 8మంది రిటైర్ తర్వాత బలబలాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తాజా మార్పులతో వైసీపీ బలం 21కి పెరుగుతుండగా.. టీడీపీ బలం 15కి పడిపోతుంది. విపక్ష టీడీపీ కంటే 6 సీట్లు ఆధిక్యంలోనే టీడీపీ ఉంది. దీంతో ఇక మండలిలోనూ మూడు రాజధానులు సహా అన్ని బిల్లులను నెగ్గించుకోవడం వైసీపీకి సులభం కానుంది.