Begin typing your search above and press return to search.

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారిలో అంత మంది మిస్సింగ్?

By:  Tupaki Desk   |   2 Dec 2021 2:30 AM GMT
ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారిలో అంత మంది మిస్సింగ్?
X
ఒకవైపు ఒమిక్రాన్ టెన్షన్ అయితే.. మరోవైపు ఆఫ్రికా దేశాల నుంచి దేశానికి వచ్చిన ప్రయాణికుల బాధ్యతారాహిత్యం దేశానికి ఇబ్బందుల్లోకి నెట్టనుందా? ఆఫ్రికా దేశాల నుంచి కొద్ది రోజులుగా వచ్చిన ప్రయాణికుల పరిస్థితి ఇప్పెడెలా ఉందన్న విషయాన్ని చెక్ చేసే సమయంలో అధికారులకు.. పలువురుప్రయాణికుల ఆచూకీ లభించకపోవటం ఇప్పుడు కొత్త టెన్షన్ ను తెప్పిస్తుందన్న మాట వినిపిస్తోంది.

పాస్ పోర్టుల్లో పేర్కొన్న చిరునామాలకు.. వారిప్పుడు ఉన్న ప్రాంతాలకు సంబంధం లేకపోవటం.. పాస్ పోర్టుల్లో పేర్కొన్న చిరునామాలకు వెళ్లిన ఆరోగ్య సిబ్బందికి.. అక్కడ వారు లేకపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇలా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి.. పాస్ పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో కాకుండా వేరే చోట ఉన్న వారు కానీ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడితే.. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

గడిచిన పదిహేను రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబయికి సుమారు వెయ్యి మంది చేరుకున్నారు. వీరిలో 466 మంది ఆచూకీ మాత్రమే గుర్తించినట్లుగా ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి బిహార్ కు వచ్చిన 281 మందిలో 100 మంది కనిపించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అదే రీతిలో ముంబయిలోనూ ఇంత భారీగా ప్రయాణికుల ఆచూకీ లభించకపోవటం కొత్త టెన్షన్ కు దారి తీస్తోంది.

ఇదే రీతిలో హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుల్లో కొందరు ఆచూకీ దొరకటం లేదన్న వార్తలు వచ్చినా.. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్ కావటం.. డెల్లా వేరియంట్ కు భిన్నంగా అతని వేరియంట్ ఉండటంతో అతన్ని ప్రత్యేకంగా ఆసుపత్రికి తరలించటం తెలిసిందే.

అతడి నమూనానను జినోమ్ విశ్లేషణకు పంపారు. దాని ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇలాంటి వేళ.. ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న వారి జాడ మిస్ కావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.