ఆవులు కాదు.. మహిళలను చూడు మోడీజీ

Wed Oct 16 2019 15:03:45 GMT+0530 (IST)

Miss kohima 2019 Comments on Modi

ప్రధాని నరేంద్రమోడీ పెళ్లయినా కానీ కొన్ని కారణాలతో భార్యను విడిచిపెట్టి ఆర్ ఎస్ ఎస్ లో చేరి బీజేపీలోకి మారి దేశానికి ప్రధాని అయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు.. మోడీ జీవితం మొత్తం రాజకీయాలకే అంకితం చేశాడు. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలతో గోవధను నియంత్రించాడు. ఆవులను కాపాడాలని - పారిశధ్యం - స్వచ్ఛత సహా కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు.  మహిళల వాసన పడని మోడీజీపై తాజాగా ఈశాన్య రాష్ట్రంలోని నాగాలాండ్ లో జరుగుతున్న మిస్ కోహిమా అందాల పోటీలో రన్నరప్ గా నిలిచిన సువోహు హాట్ కామెంట్ చేశారు.  అందాల పోటీలో భాగంగా ఫైనల్ కు చేరిన సువోహును జ్యూరీ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు.. ‘ప్రధాని నరేంద్రమోడీ మిమ్మల్ని పిలిచి మాట్లాడితే ఏం మాట్లాడుతారు?’ అని ప్రశ్నిచారు.. దీనికి సువోహు ఇచ్చిన సమాధానం విని జ్యూరీ సభ్యులు.. వేదిక కింద ఉన్న ఔత్సాహికులు నవ్వులు చిందిస్తూ చప్పట్లో ఎంకరేజ్ చేశారు..

ఇంతకీ సువోహు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.? ‘నన్ను భారత  ప్రధాని మోడీ మాట్లాడేందుకు  పిలిస్తే ఆవుల మీద కన్నా మహిళల మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆయనకు చెప్తాను’ అని పేర్కొంది. ఆమె తెలివైన సమాధానానికి ఆడియెన్స్ లో మంచి స్పందన వచ్చింది. కాగా సువోహు ఇచ్చిన  సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మోడీజీ మహిళలకు దూరంగా బ్రహ్మచారిగా మిగిలిపోయిన వైనంపై ఈ డైలాగ్ బాగా పేలింది.