కూర్చున్న చోటే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..!

Fri Dec 02 2022 21:15:36 GMT+0530 (India Standard Time)

Misfortune chased him where he was sitting

ఎవరికీ ఎంత ఆయుష్షు ఇవ్వాలో దేవుడి ముందు డిసైడ్ చేస్తాడు. ఆ వ్యక్తి ఆయువు తీరిదంటే చాలు మృత్యువు ఏదో ఒక రూపంలో వచ్చ ప్రాణాలను తీసుకెళ్తుందని అంతా నమ్ముతుంటారు. అయితే ఆయుష్షు ఉన్న వాళ్లు మాత్రం ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నా ప్రాణాలతో బయట పడుతూ మృత్యుంజయులుగా నిలుస్తున్నారు.ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో తరుచూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. నిలుచున్న చోటే మనిషి ఆకస్మాత్తుగా కూలిపోయి మరణించడం.. సరదాగా డాన్స్ చేస్తూ మృత్యుఒడిలోకి వెళ్లడం లాంటి వీడియోలు ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారు. అలాగే రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకున్న ఘటనలు కూడా అనేకం సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి.

అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఢిల్లీలోని ప్రయాగ్ రాజ్ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒక యువకుడిని దురదృష్టం వెంటాడటంతో కూర్చున్న చోటే రెప్పపాటులో ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!

హరికేశ్ దుబే అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి కాన్పూర్ కు నిలనాచల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లో బయలుదేరాడు. అప్పటి వరకు స్నేహితులతో సరదాగా గడిపిన ఆ వ్యక్తి పక్కనే ఉన్న విండో సీటుకు మారాడు. ఈక్రమంలోనే దన్వర్ సోమ్నా స్టేషన్ల మధ్య ఒక ఇనుప చువ్వు హఠాత్తుగా బోగిలోకి హరికేశ్ మెడలోకి చొచ్చుకొచ్చింది. పక్కన ఉండే వాళ్లు గమనించే లోగే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఈ సంఘటనపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే సిబ్బంది అలిగడ్ జంక్షన్లో రైలును ఆపి మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ విషాద ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. కొన్నిచోట్ల ట్రాక్ లు సరిచేసే క్రమంలో ఇనుప కడ్డీ బోగీలోకి దూసుకొచ్చిందని అధికారుల దర్యాప్తులో వెల్లడైందని రైల్వే శాఖ ప్రకటించడం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.