యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ .. ఆ తర్వాత ఏమైందంటే

Thu Oct 28 2021 12:10:10 GMT+0530 (IST)

Minor gave birth to a child by watching YouTube

ఓ 17 ఏళ్ల మైనర్ అమ్మాయి తనకి పొరుగింట్లో ఉండే వ్యక్తి వల్ల గర్భం దాల్చింది. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకి తెలియకుండా దాచిపెట్టి చివరికి యూట్యూబ్ లో చుటూ సొంతంగా ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో వెలుగుచూసింది. ఈనెల 20న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి మలప్పురం జిల్లా లో ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక  తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. తల్లికి దృష్టిలోపం ఉండగాతండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. దీనితో అమ్మాయి చదువుకుంటుంది అని పెద్దగా పట్టించుకోలేదు.అయితే  తన పక్కింటిలో ఉండే 21 ఏళ్ల యువకుడితో పరిచయం కాస్త ప్రేమ గా మారింది. దీంతో ఇద్దరు శారీరకంగా దగ్గరకావడంతో బాలిక గర్భం దాల్చింది. దృష్టి లోపం కారణంగా ఈ విషయాన్ని తల్లి గుర్తించలేదు. తండ్రి రాత్రి పూట విధులు నిర్వర్తిస్తూ ఎక్కువగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో బాలికకు నెలలు నిండాయి. ఈ నెల 20న బాలిక ఇంట్లోని గదిలోకి వెళ్లి పండండి మగబిడ్డ కు జన్మనిచ్చింది. యూట్యూబ్ లో చూసి బొడ్డు తాడును కత్తిరించుకుంది. ఈ విషయం రెండు రోజుల వరకు బాలిక తల్లిదండ్రులకు తెలియలేదు. మూడో రోజు బాలుడు ఏడవడంతో విషయం బాలిక తల్లికి తెలిసింది.

బాలికతో పాటు పుట్టిన పిల్లాడికి ఇన్పెక్షన్ కావడంతో బాలిక తల్లి ఇద్దరిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. తల్లీ బిడ్డలు ఇద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మైనర్ బాలిక గర్భం దాల్చడం గురించి ఆస్పత్రి సిబ్బంది మలప్పురం జిల్లా శిశు సంక్షేమ కమిటీ  కి సమాచారం అందించగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక గర్భం దాల్చడానికి కారణమైన ఆమె ప్రియుడిని పోలీసులు పోక్సో చట్ట  నిబంధనల కింద బుధవారం అరెస్టు చేశారు. కొట్టకల్ ఠాణా పరిధిలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక 21 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి అంగీకరించిన పెద్దలు బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని నిశ్చయించారు. ఇంతలోనే గర్భవతి అయిన బాలిక విషయం తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు.  బిడ్డ ఏడుపు వినడంతో అసలు విషయం బయటకు వచ్చింది.